83 Movie Review: రణ్‌వీర్‌ సింగ్ "83" మూవీ రివ్యూ

Update: 2021-12-24 10:44 GMT

83 మూవీ తెలుగు రివ్యూ

నటీనటులు: రణవీర్ సింగ్, దీపిక పదుకునే, జీవా, చిరాగ్ పాటిల్, పంకజ్ త్రిపాఠీ తదితరులు

దర్శకత్వం : కబీర్ ఖాన్

నిర్మాతలు: మధు మంతెన, విష్ణు ఇందూరి

సంగీత దర్శకుడు: ప్రీతమ్ చక్రవర్తి

సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా

విడుదల తేదీ : 24/12/2021

కథ:

భార‌త క్రికెట్ చరిత్ర‌లో ఎప్పటికి మర్చిపోలేని సంవత్సరం "1983". ఈ కథ కూడా 1983 నాటి ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకున్న క్రమాన్ని, ఆ క్రమంలో ఎదురుకున్న ఇబ్బందులను, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు? ఎలా ప్రపంచకప్ గెలిచారు? అలాగే కపిల్ దేవ్ జీవితం గమనం ఏమిటి ? ఆయన సాధించిన విజయాల వివరాలు తాలూకు సంఘటనల ఏమిటి అనేది మిగిలిన కథ.

నటీనటులు:

కపిల్ దేవ్ పాత్రలో నటించిన రణ్ వీర్ సింగ్ తన నటన సినిమాకి హైలైట్ గా చెప్పొచ్చు. ముఖ్యంగా నటరాజ్ షాట్ ఆడిన విధానం రణ్ వీర్ సింగ్ కాదు కపిల్ దేవ్ తెర మీద ఉన్నాడా అనిపిస్తుంది. కృష్ణమాచారిగా జీవా అలరించాడు. కపిల్ దేవ్ భార్యగా రోమి భాటియా పాత్రలో నటించిన దీపికా పదుకొనే ఉన్నంత సేపు పాత్రకు అందం తీసుకొచ్చింది. సరదా సన్నివేశాలు ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తే ఎమోషనల్ సీన్స్ మనసుకి హత్తుకుంటాయి.

సాంకేతిక వర్గం:

మేకింగ్ పరంగా కూడా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. అసీమ్ మిశ్రా తన సినిమాటోగ్రఫీతో సినిమాని 1983 రోజుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దర్శకుడు కబీర్ ఖాన్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చూపించాడని చెప్పొచ్చు. కోట్లాది క్రికెట్ అభిమానులున్న కపిల్ దేవ్ కథను ఎవరికి తెలియని కోణంలో చెప్పాలన్న ప్రయత్నంలో దర్శకుడు సూపర్ సక్సెస్ అయ్యాడు. ఎడిటింగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

బలాలు:

రణ్ వీర్ సింగ్ నటన

సెకండాఫ్

సినిమాటోగ్రఫీ

క్లైమాక్స్

బలహీనతలు:

  • ఫస్ట్ ఆఫ్
  • స్లో నేరేషన్

బాటమ్ లైన్: భావి తరాలకు 83 చిత్రం ఓ సినిమా కాదు.. కులం, మతం, ప్రాంతాలను ఏకం చేసే ఒక ఎమోషనల్ జర్నీ 

Tags:    

Similar News