మానసిక సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం..

Update: 2019-06-18 11:40 GMT

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి మానసిక కుంగుబాటుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ఈ మానసిక కుంగుబాటునే డిప్రెషన్ అంటారు. డిప్రెషన్‌ వల్ల శరీరంలోని జీవక్రియలన్నీ నిదానిస్తాయి. అంటే సాఫీగా జరగాల్సిన చర్యలు కుంటుపడతాయి. ఇవి చివరకు వృత్తిపరమైన నిర్లిప్తతకూ, అసమర్థతకూ కారణమవుతాయి.

మానసిక సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం ధ్యానం. మనోబలాన్ని ఇస్తూ ఉత్తేజితం చేసే ధ్యానం మనిషిని మానసికంగా దృఢంగా మారుస్తుంది. పైసా ఖర్చు లేకుండా డిప్రెషన్‌ నుంచి బయటపడేసి ఏకైక దివ్యౌషధం. ప్రతి రోజు ధ్యానం చేయడం వల్ల పూర్తిగా మానసిక ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంది.

ధ్యానానికి ప్రతికూల పరిస్థితులను సమూలంగా తొలగించే శక్తివుంది రోజు క్రమం తప్పకుండా రోజూ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి పాటు... మనసు నిలకడ ఉంటుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. 

Tags:    

Similar News