చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు 20లో 40ల కనిపిస్తున్నారు. అయితే అలా కాకుండా తాజా ట్రెండ్లు ఫాలో అవడం వల్ల యవ్వనంగా, అందంగా కనిపిస్తారు. మంచి ట్రెండ్స్ ధరించడం వల్ల స్టైల్‌గా కనిపించడంతోపాటు, హూందాగానూ వెలిగిపోతారు! అవి ఏంటో చూద్దాం...
మోకాళ్ల పై వరకూ పొడవుండే టాప్స్, పాటియాలా ప్యాంట్లు, ఎంబ్రాయిడరీ టాప్స్, వదులుగా ఉండే ప్యాంట్లు, ఉంటే వాటిని వేసుకోవడం మానేయండి. ఒంటికి అతుక్కునే స్కిన్ టైట్ కాకుండా, స్ర్టెయిట్ కట్ జీన్స్ వేసుకోండి. నడుము వెడల్పుగా ఉంటే, బూట్ కట్ జీన్స్ ఎంచుకోండి. ఎలాంటి జీన్స్ ఎంచుకున్నా 'స్ట్రెచబులై అయి ఉండాలి.
చర్మపు రంగులో కలిసిపోయే రంగులు ,వెలసిపోయిన రంగులు ఎంచుకోకూడదు.క్లాసీగా కనిపించాలనుకుంటే, లేత రంగులు దుస్తులు వేసుకోవాలి. అట్రాక్ట్ చేయాలనుకుంటే ఎరుపు, పసుపు, గులాబీ రంగులు బాగుంటాయి.