Winter Skin Care Tips: స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!

చలికాలం ప్రారంభమైందంటే చాలు.. వాతావరణంలో తేమ తగ్గి గాలి పొడిబారుతుంది. దీని ప్రభావం మన శరీరంపై, ముఖ్యంగా చర్మంపై ఎక్కువగా ఉంటుంది.

Update: 2025-12-30 07:00 GMT

Winter Skin Care Tips: స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!

Winter Skin Care Tips: చలికాలం ప్రారంభమైందంటే చాలు.. వాతావరణంలో తేమ తగ్గి గాలి పొడిబారుతుంది. దీని ప్రభావం మన శరీరంపై, ముఖ్యంగా చర్మంపై ఎక్కువగా ఉంటుంది. సాధారణ వ్యక్తులకు చర్మం కేవలం పొడిబారితే, చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మాత్రం ఈ కాలం ఒక పెద్ద సవాలుగా మారుతుంది.

స్నానం చేసేటప్పుడు, స్నానం తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. దురద, మంట, చర్మం పగలడం వంటి సమస్యలు ముదురుతాయి. నిపుణుల సూచనల ప్రకారం చర్మ వ్యాధిగ్రస్తులు చలికాలంలో అనుసరించాల్సిన ముఖ్యమైన చిట్కాలు తెలుసుకుందాం.

1. నీటి ఉష్ణోగ్రత : చలిగా ఉందని చాలామంది మసిలే నీళ్లతో స్నానం చేస్తారు. కానీ చర్మ వ్యాధులు ఉన్నవారు గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. వేడి నీరు చర్మంలోని సహజ నూనెలను తొలగించి, చర్మాన్ని మరింత పొడిగా మారుస్తుంది. దీనివల్ల ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలు ఉల్బణగిస్తాయి.

2. స్నానపు సమయం తగ్గించండి: నీటిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల చర్మం తన తేమను కోల్పోతుంది. కాబట్టి, స్నానాన్ని 5 నుంచి 10 నిమిషాల లోపే ముగించడం మంచిది. ఎక్కువ సేపు షవర్ కింద నిలబడటం లేదా టబ్‌లో కూర్చోవడం వల్ల చర్మం సున్నితంగా మారి ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.

3. సబ్బు ఎంపికలో జాగ్రత్త: స్ట్రాంగ్ కెమికల్స్ లేదా ఎక్కువ సువాసన ఉండే సబ్బులు కాకుండా, మైల్డ్ క్లెన్సర్స్ లేదా డాక్టర్ సూచించిన మాయిశ్చరైజింగ్ సబ్బులను మాత్రమే వాడాలి. చర్మాన్ని గట్టిగా రుద్దడం మానేయాలి.

4. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ తప్పనిసరి: స్నానం చేసిన వెంటనే, చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే (3 నిమిషాల లోపు) మంచి మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె అప్లై చేయాలి. దీనివల్ల చర్మంలో తేమ లాక్ అవుతుంది. ఇది దురద, పొలుసులు రాకుండా కాపాడుతుంది.

5. లోపలి నుంచి ఆరోగ్యం : చలికాలంలో దాహం వేయదు కాబట్టి చాలామంది నీళ్లు తక్కువ తాగుతారు. కానీ చర్మం లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలి. తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి.

Tags:    

Similar News