Winter Diet: చలికాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఈ 5 ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి

చలికాలంలో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. వింటర్ డైట్‌లో ఈ 5 ఫుడ్స్‌కు నో చెప్పండి.

Update: 2026-01-02 09:06 GMT

Winter Diet: చలికాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఈ 5 ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి

చలికాలం ప్రారంభమవడంతో శరీరానికి అవసరమైన పోషకాలు, ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోతున్న వేళ తప్పు ఆహారపు అలవాట్లు అనుసరిస్తే బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని పూనేకు చెందిన న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అందుకే చలికాలంలో కొన్ని ఆహారాలకు పూర్తిగా నో చెప్పాలని సూచిస్తున్నారు.

చలికాలంలో దూరంగా ఉండాల్సిన 5 ఫుడ్స్ ఇవే..

1. ఉసిరి క్యాండీ

ఉసిరికాయ ఆరోగ్యకరమైనదే అయినా క్యాండీ రూపంలో తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇందులో చక్కెర మోతాదు అధికంగా ఉండటంతో శరీరానికి హాని చేసే అవకాశం ఉందని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఉసిరిని చట్నీ, కూర లేదా పచ్చడి రూపంలో మాత్రమే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

2. చ్యవన్‌ప్రష్

చలికాలంలో చాలామంది చ్యవన్‌ప్రష్‌ను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఇందులో కూడా అధికంగా చక్కెర కలిపి ఉండటంతో ఇది ఆరోగ్యానికి హానికరమని నిపుణుల అభిప్రాయం. దీనికి బదులుగా తాజా కూరగాయలతో తయారుచేసిన సూపులు, ఫ్రూట్ జ్యూసులు తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు.

3. డ్రై ఫ్రూట్ లడ్డూలు

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివైనా, లడ్డూలుగా తయారుచేసినప్పుడు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఒక్క లడ్డులోనే సుమారు 200 క్యాలరీలు ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇవి సమస్యగా మారవచ్చు. నానబెట్టిన గింజలు, విత్తనాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

4. ప్యాక్ చేసిన రెడీమేడ్ సూప్స్

చలికాలంలో త్వరగా తయారయ్యే ప్యాక్ సూప్స్ వైపు చాలామంది ఆకర్షితులవుతారు. కానీ వీటిలో సోడియం, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉండటంతో ఆరోగ్యానికి హానికరం. ఇంట్లో తాజా కూరగాయలతో తయారుచేసిన సూప్స్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు.

5. నెయ్యి 

నెయ్యి శరీరానికి మంచిదే అయినా, చలికాలంలో అతిగా తీసుకుంటే క్యాలరీలు పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి పరిమిత మోతాదులో మాత్రమే నెయ్యిని డైట్‌లో చేర్చుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.

నిపుణుల ప్రకారం చలికాలంలో సమతుల్య ఆహారం, తగిన వ్యాయామం, సరైన నీటి వినియోగం ఉంటే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటం సులభమవుతుంది.

Tags:    

Similar News