మనిషికి మెగ్నీషియం ఎంత అవసరం? ఏం తింటే వస్తుంది?

Magnesium for healthy life: శరీరానికి సరిపడ మెగ్నీషియం లభించకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎముకల బలం తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. మరి ఏం తింటే ఆ మెగ్నీషియం లభిస్తుంది?

Update: 2025-02-01 14:39 GMT

Importance of Magnesium: మనిషికి మెగ్నీషియం ఎంత అవసరం? ఏం తింటే వస్తుంది?

Magnesium for healthy life: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడ మెగ్నీషియం అందాల్సిందే. ఇది గుండె లయ, కండరాల సంకోచం, రక్తపోటు నియంత్రణ, ఎముకల బలాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. సుమారు 300కిపైగా శారీరక క్రియల్లో మెగ్నీషియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇంతకీ సగటున ఒక మనిషికి ఎంత మెగ్నీషియం అవసరం? వేటిని తీసుకుంటే మెగ్నీషియం లభిస్తుంది? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సగటున ఒక వ్యక్తి రోజుకు 310 మి.గ్రా నుంచి 420 మి.గ్రా. మెగ్నీషియం అవసరపడుతుంది. 30 గ్రాముల బాదంలో 80 మి.గ్రా. మెగ్నీషియం ఉంటుంది. అలాగే 30 గ్రాముల జీడిపప్పు – 72 మి.గ్రా, 30 గ్రాముల వేరుశనగలో 49 మి.గ్రా, 30 గ్రాముల గుమ్మడి గింజల్లో 150 మి.గ్రా, 1 చెంచాడు అవిసె గింజల్లో 40 మి.గ్రా, అరకప్పు మొక్కజొన్న గింజలు – 27 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. అరకప్పు ఉడికించిన శనగల్లో 60 మి.గ్రా మెగ్నీషియం లభిస్తోంది. వీటితోపాటు కంది, పెసర, మినప, శనగ పప్పులో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది.

పాలు, పెరుగులో క్యాల్షియంతో పాటు మెగ్నీషియం లభిస్తుంది. 1 కప్పు పాలలో 27 మి.గ్రా, పావు కిలో పెరుగు – 42 మి.గ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఆకు కూరలు, కూరగాయల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అరకప్పు ఉడికించిన పాలకూర – 78 మి.గ్రా, అరకప్పు బఠానీలు 31 మి.గ్రా, అరకప్పు బంగాళాదుంపలు – 48 మి.గ్రా మెగ్నీషియం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మెగ్నీషియం లోపిస్తే ఏమవుతుంది?

శరీరానికి సరిపడ మెగ్నీషియం లభించకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎముకల బలం తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. నాడీ వ్యవస్థ పనితీరుపై దుష్ప్రభావం పడుతుంది. మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News