గర్భిణులు మద్యం తాగితే..?

Update: 2019-06-20 13:37 GMT

మహిళలు గర్భంతో ఉన్న సమయంలో గ్లాస్ వైన్ కానీ, ఇతర మద్యం కానీ తీసుకోవడం వల్ల పుట్టే పిల్లల ప్రవర్తనలో తేడా వస్తాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఫలితం కొన్ని తరాలపాటు కొనసాగుతుందని పేర్కొంది. గర్భిణులు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలపై న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గర్భం దాల్చిన మొదట్లో లో మహిళలు మద్యం, సిగరెట్‌ తాగితే పుట్టబోయే పిల్లల్లో జన్యసిద్ధ వైకల్యం వచ్చే ప్రమాదం ఉంది. చీలిన పెదవులు, అంగిలి అస్థిరత లాంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు వెల్లడించారు. పళ్ల వరుస దెబ్బతిని, దవడలు వంకర టింకరగా మారి ముఖం వికారంగా మారుతుందని తెలిపారు. ఆసియాలోని ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 1.7 శాతం మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. భారత్‌లో ప్రతి సంవత్సరం 35 వేల మంది పిల్లలు జన్మసిద్ధ వైకల్యాలతో పుడుతున్నారని వెల్లడించారు.

గర్భంతో ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకున్న వారికి పుట్టే పిల్లల్లో శారీరక బరువు, మెదడు పరిణామం అన్ని తరాల్లోనూ తగ్గిపోతుందని తెలిపారు. కాబట్టి గర్భిణులు ఆల్కహాల్‌కు దూరంగా ఉండడమే మేలని శాస్త్రవేత్తలు సూచించారు. తద్వారా కొన్ని తరాలను కాపాడిన వారవుతారని పేర్కొన్నారు.  

Tags:    

Similar News