యాలకులతో చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు

Update: 2019-07-06 15:08 GMT

అందంగా కనిపించాలని..మంచి ఫిజిక్ ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి.అయితే చక్కటి ఆర్యోగం కోసం యాలకులు తింటే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాదు... కాన్సర్ లాంటి వ్యాధుల్ని కూడా అడ్డుకుంటాయని అంటున్నారు. డిప్రెషన్ నుంచీ బయటపడాలంటే ఏ యాలకుల టీయో, పాలో తాగితే సరి సూచిస్తున్నారు. సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు బాగా ఉపయోగపడతయంటా.వాటిలోని సినియోల్ అనే కాంపౌండ్... పురుషుల్లో నరాల పటిష్టతకు చేస్తుంది.

రోజూ చిటికెడు యాలకుల పొడి తీసుకుంటే చాలు.. సంతాన భాగ్యం కలుగుతుంది. నరాల బలహీనత ఉన్నవారు, లైంగిక సామర్ధ్యం లేనివారూ... యాలకులు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే డిప్రెషన్‌కి సరైన మందు యలకులు.. కొంతమంది బాధల్ని తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి నెగెటివ్ ఆలోచనల నుంచీ యాలకులు కాపాడగలవు. రోజూ యాలకుల టీ తాగితే. చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. యాలకుల్లో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ రిస్క్‌ను తగ్గిస్తుంది. యలకుల్లో ఉండే ప్రయోజనాలు తెలుసుకునేందుకు మరిన్ని ప్రయోగాలూ, పరిశోధనలూ జరుగుతున్నాయి. 

Tags:    

Similar News