సీజన్‌ మారిందంటే వైరల్‌ ఫ్లూ అటాక్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

సీజన్‌ మారిందంటే వైరల్‌ ఫ్లూ అటాక్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Update: 2022-10-13 04:30 GMT

సీజన్‌ మారిందంటే వైరల్‌ ఫ్లూ అటాక్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Health Tips: సీజన్‌ మారినప్పుడు అనేక రకాల వ్యాధులు సంభవిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఫ్లూ, జ్వరం, టైఫాయిడ్, డయేరియా వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులు ఉన్నవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని కోసం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం అవసరం. లేదంటే త్వరగా అనారోగ్యానికి గురవుతారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సీజన్ మారిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

1. హెర్బల్ టీ

ఆరుబయట వర్షం పడుతూ వేడిగా టీ, పకోడీలు తింటే ఆ మజానే వేరుంటుంది. కానీ వర్షాకాలంలో సాధారణ టీకి బదులు హెర్బల్ టీ తాగాలి. నిజానికి వర్షాకాలంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. హెర్బల్ టీలో యాంటీ బాక్టీరియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2. వేడి నీరు

వర్షాకాలంలో సాధారణ నీటిని తాగకుండా వేడి నీటిని తాగాలి. దీనివల్ల ముక్కు కారడం సమస్య నుంచి బయటపడవచ్చని అనేక పరిశోధనల్లో తేలింది. అంతేకాదు గొంతు సమస్యలకి కూడా పరిష్కారం లభిస్తుంది.

3. మొలకలు

మొలకలలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. అంతే కాకుండా వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి, ఎముకలు బలపడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి మొలకలను తీసుకోవడం ఉత్తమం.

4. వీటికి దూరంగా ఉండాలి..

వర్షాకాలంలో చల్లని పదార్థాలు తినకూడదు. ఎందుకంటే దగ్గు, జలుబు ప్రమాదం పెరుగుతుంది. ఈ సీజన్‌లో వీలైనంత వరకు ఐస్‌క్రీం, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. ఇది కాకుండా ఆల్కహాల్, మసాలా వస్తువులకు దూరంగా ఉండాలి.

Tags:    

Similar News