అన్నం అరగకపోతే ఈ ఆసనం చేయండి..

Update: 2019-07-09 15:37 GMT

చాలా మంది తిన్న ఆహారం సరిగా జీర్ణంకాక బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి బయట పడడానికి వజ్రాసనం వేయటం సాధన చేయండి. అతి ముఖ్యమైన యోగాసనాల్లో ఇదొకటి. మలద్వారం, జననాంగాలపై ఇది ప్రభావం చూపుతుంది. భోజనం చేసిన తర్వాత వేసే ఆసనంలో ఇదొక్కటి.

ఎలా చేయాలంటే?

రెండు కాళ్లను ముందుకు చాచి కూర్చోవాలి. ఒక కాలు తర్వాత ఒక్కదాన్ని మోకాళ్ల దగ్గర వంచుతూ వెనక్కి తీసుకుంటుండాలి. పాదాలను పిరుదుల కిందికి తీసుకోనిరావాలి. మడమలు ఎడంగా ఉంచి.. బొటనవేళ్లు తాకేలా చేయాలి. అరచేతులను మోకాళ్ల మీద ఉంచి. శరీర బరువు పిరుదులపై పడేలా చూసుకోవాలి. తల, వెన్నెముక నిటారుగా ఉంచి. కళ్లు మూసుకొని నిదానంగా శ్వాసను తీసుకోవాలి. కొద్దిసేపు అలా ఉండి తిరిగి మామూలు స్థితికి రావాలి. కష్టంగా ఉంటే ముందుగా ఒక పాదంపై కూర్చోని సాధన చేయాలి. తర్వాత రెండు పాదాల మీద కూర్చోవాలి. వజ్రాసనం వేసేటప్పుడు ధ్యాసను శ్వాస మీద కేంద్రీకరించాలి. మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవారు న దీన్ని వేయకపోవటం మంచిది. ఈ అసనం చేయడం వల్ల తొడలు, మోకాళ్లు, పిక్కలను బలోపేతం మారుతాయి. ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. మలబద్ధకం, పులితేన్పులు, మొలలు, హెర్నియా నివారణకు సహయపడుతుంది.

Tags:    

Similar News