గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా చేస్తే..

Update: 2019-08-25 13:19 GMT

ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య స్థూలకాయం, రోజాంత ఉద్యోగంలో ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల కూడా ఊబకాయం రావడానికి కారణమవుతుంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో కొవ్వు పేరుకుపోవడం. దీనివల్ల గుండె సమస్యలు కూడా తలెత్తుతాయి. ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గుండె సమస్యలు వస్తున్నాయి.

ఇప్పుడు సంభవించ అత్యధిక మరణాలు గుండె వ్యాధుల వలనే ఉంటున్నాయి. గుండె జబ్బులకు కారణం రక్త సరఫరాలో వచ్చే అవరోధాలే . గుండెకు సరిగ్గా రక్త సరఫరా లేకపోవడం, నరాల్లో కొవ్వు పేరుకుపోవడం వంటి వాటితో గుండెకు ముప్పు వాటిల్లుతోంది. గుండెల్లో నొప్పి, గుండె పట్టేసినట్టు ఉండడం వంటి లక్షణాలు రాబోయే తీవ్ర అనారోగ్యాలకు సూచికలకుగా భావించాలి.

అయితే ఈ సమస్యకు కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటించడం ద్వారా ఆ బబ్బును దూరంగా చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయల్ని జ్యూస్‌గా చేసి గాజు సీసాలో కలిపి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని రోజూ ఒక చెంచా చొప్పున పరగడుపున త్రాగితే రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. ఇలా రోజు తప్పకుండా చేస్తున్నట్లయితే గుండె జబ్బులు రావు. అలాగే ఆయుష్షు కూడా పెరుగుతుంది. రోజూ పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని తిన్నా మంచి ఫలితం ఉంటుంది. వాటితో పాటు ఉసిరికాయ పొడిలో కొద్దిగా తేనె లేదా పంచదార కలిపి నీటితో తీసుకుంటే కూడా గుండె సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. 

Tags:    

Similar News