బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా..!

Update: 2019-06-11 13:10 GMT

ఇష్టమైన బైక్ మీద లాంగ్ డ్రైవ్.. అబ్బా ఆ థ్రిల్ చెప్పలేనిది.. అనుభవించే వారికి తెలుసు. అవును లాంగ్ టూర్లకు వెళ్లే కొంతమంది అభిప్రాయం ఇది. బైక్‌లపై లాంగ్‌టూర్లకు వెళ్లడం చాలామందికి సరదాగా ఉంటుంది. ఇంకొందరికైతే తమ జీవనశైలిలో ఒక భాగంగా లాంగ్ టూరికి వెళ్తుంటారు. కారణం ఏదైనా లాంగ్ టూరికి వెళ్లాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా మీ బైకుకు కొన్ని అదనపు ఫిటింగ్స్‌, యాక్సెసరీలు ఉండి తీరాల్సిందే.

కానీ అవి ఎక్కడ దొరుకుతాయో.. వాటి రేటు ఎంతో చాలామందికి తెలియదు. ఇలాంటి గందరగోళానికి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ చక్కని పరిష్కారం చూపిస్తుంది. లాంగ్‌టూర్లకు అవసరమైన చాలా పరికరాలు అందుబాటులో పెట్టి.. వాటి ధరల వివరాలు ప్రకటించింది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌సైకిల్‌ కంపెనీ.

పానియర్‌ మౌంట్‌ కిట్‌, లగేజ్‌ ర్యాక్‌, టూరింగ్‌ సీట్‌, హెడ్‌లైట్‌ గ్రిల్‌, క్రాష్‌గార్డ్‌, క్లియర్‌ విండ్‌షీల్డ్‌.. ఇలా ఇరవైఅయిదు యాక్సెసరీల వివరాలు, వాటి రేటు స్పష్టంగా ప్రకటించింది. దీంతో రైడర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన వాటిని తేలిగ్గా కొనుక్కోవచ్చు. ఇంకేందుకు ఆలస్యం మీకు ఇష్టమైన లాంగ్ డ్రైవ్ ని సేఫ్ గా ముంగించుకుని వచ్చేయండి. 

Tags:    

Similar News