మీ బంధం బలపడాలంటే ..

Update: 2019-07-20 12:54 GMT

ఆర్ధం పర్ధం లేని అనుమానంతో అనందంగా సాగాల్సిన జీవితాన్ని మధ్యలోనే విరామం పలుకుతున్నాయి చాలా జంటలు. చిన్నచిన్న తప్పులకే బంధాన్ని తేచ్చుకోవడం మంచిది కాదు. సందేహం కలిగినా.. ఏదైనా సమస్య ఎదురైనా.. వాటిని ఇద్దరు కలసి చర్చించుకుని ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి. అలా కాకుండా వారిపై ద్వేషం పెంచుకుంటే మాత్రం మీ జీవితం అంధకారంలోకి వెళ్లే ప్రమాదముంది. ఊహాజనిత ఆలోచనలే బంధాన్ని మరింత బలహీనపడేలా చేయగలవు. అవేంటో ఓ సారి చూద్దాం...

ప్రతి చిన్న విషయాన్ని కూడా భాగస్వామితో పోల్చి చూడకూడాదు. అది అంతమంచిది కాదు. గొప్పలకు పోకుండా. గతంలో జరిగిన వాటిని ప్రస్తుత విషయాలతో కంపేర్ చేయకపోవడం మంచిది.పార్టనర్స్ ప్రాధాన్యతలు వేరు వేరుగా ఉంటాయి. మీ ప్రాధాన్యతలు మీ భాగస్వామిపై రుద్దకపోవడమే మంచిది. ఇద్దరూ పరస్పరంగా చర్చించుకుని జీవితాన్ని ముందుకు సాగాల్సిందే ప్రేమలో ఈర్ష్య ఖచ్చితంగా ఉంటుంది. దీనిని మన దగ్గరకు రానివ్వకుడాదు. ఈ భావనను గుర్తించగలిగి దాని ప్రభావం జీవితంపై పడకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరికి పర్స్‌నల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. దానికి మీరు సమయం కేటాయించాలి. మీ భాగస్వామి ఇండివిడ్యువల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు మీరు ఇన్వాల్ అవ్వకూడదు. 

Tags:    

Similar News