Paneer: ఆరోగ్యానికి మంచిదని పన్నీర్‌ తింటున్నారా.? ఓసారి ఈ విషయాలు తెలుసుకోండి..!

Paneer: పన్నీర్‌లో కాల్షియంతో పాటు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీంతో చాలా మంది పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు.

Update: 2025-03-15 11:58 GMT

Paneer: పన్నీర్‌లో కాల్షియంతో పాటు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీంతో చాలా మంది పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా నాన్‌ వెజ్‌ తినని వారు పన్నీర్‌కు మొగ్గు చూపుతుంటారు. అయితే విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉండే పన్నీర్‌తో లాభాలు ఉన్నాయన్న దాంట్లో ఎంత వరకు నిజం ఉందో, అధికంగా తీసుకుంటే నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పన్నీర్‌కు దూరంగా ఉండడమే మంచిదని అంటున్నారు.

* పన్నీర్‌ను అధికంగా తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆహార సంబంధిత అలర్జీలు ఉన్న వారు పన్నీర్‌కు దూరంగా ఉండడమే మంచిది.

* స్కిన్‌ అలర్జీ సమస్యలతో బాధపడేవారు కూడా పన్నీర్‌కు దూరంగా ఉండడం మంచిది. పన్నీర్‌లోని లాక్టోస్‌ అలర్జీని కలిగించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* పనీర్ ఎక్కువగా తినడం వల్ల ప్రోటీన్ పరిమాణం పెరుగుతుంది, తద్వారా పనీర్ విరేచనాలకు కారణమవుతుంది. అలాగే కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* గుండె సమస్యలతో బాధపడేవారు కూడా పన్నీర్‌కు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. పన్నీర్‌లో కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది, దీనివల్ల మీరు గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది.

* అధిక రక్తపోటు ఉన్న వారు కూడా పన్నీర్‌ను తక్కువగా తీసుకోవాలి. పనీర్‌లో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. దీంతో రక్తపోటు పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Tags:    

Similar News