Health Tips: ఈ వ్యక్తులు వేరుశెనగ తినవద్దు.. చాలా హాని జరుగుతుంది..!

Health Tips: భారతదేశంలో దాదాపు అందరు వేరుశెనగ తింటారు.

Update: 2023-01-05 12:30 GMT

Health Tips: ఈ వ్యక్తులు వేరుశెనగ తినవద్దు.. చాలా హాని జరుగుతుంది..!

Health Tips: భారతదేశంలో దాదాపు అందరు వేరుశెనగ తింటారు. దీనిని చౌక బాదం అని కూడా పిలుస్తారు. ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. చలికాలంలో చాలా మంది వేరుశెనగలను ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్, పిండి పదార్థాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటాయి. అయితే ఇది కొంతమందికి చాలా హానికరం. దీని వల్ల అలర్జీ సమస్యలు ఏర్పడుతాయి. అజీర్ణంతో సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదు. రక్తపోటు, గుండె సంబంధిత రోగులు కూడా తీసుకోవద్దు.

1. మీ బరువు ఎక్కువగా ఉంటే వేరుశెనగను తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఎక్కువ కేలరీలు ఉంటాయి ఇది మీ బరువును మరింత పెంచుతుంది.

2. అజీర్ణంతో సమస్యలు ఉన్నవారు లేదా కడుపు సమస్యలతో బాధపడేవారు వేరుశెనగకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఉబ్బరంగా ఉంటుంది.

3. వేరుశెనగను అధికంగా తీసుకుంటే ఇందులోని సోడియం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి. అందుకే తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి.

4. వేరుశెనగ ఎక్కువగా తినడం వల్ల కాలేయ సమస్యలు పెరుగుతాయి. కాలేయం బలహీనంగా ఉన్నవారు వేరుశెనగ తినకుండా ఉండాలి. దీనిని ఎక్కువగా తీసుకుంటే బరువు వేగంగా పెరుగుతారు. అందుకే దూరంగా ఉండాలి.

5. వేరుశెనగలను ఎక్కువగా తినడం వల్ల అలెర్జీ సమస్య ఏర్పడుతుంది. శరీరంపై వాపు, ఎర్రటి దద్దుర్లు, దురద, కురుపులు వస్తాయి. మీకు అలెర్జీ ఉన్నట్లయితే వేరుశెనగ తినకుండా ఉండాలి. లేదా తినే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

Tags:    

Similar News