Health Tips: ఈ నూనెలు దెబ్బతిన్న జుట్టుని రిపేర్ చేస్తాయి.. అవేంటంటే..?
Health Tips:ఈ నూనెలు దెబ్బతిన్న జుట్టుని రిపేర్ చేస్తాయి.. అవేంటంటే..?
Health Tips:ఈ నూనెలు దెబ్బతిన్న జుట్టుని రిపేర్ చేస్తాయి.. అవేంటంటే..?
Health Tips: నేటి రోజుల్లో వాతావరణం, కాలుష్యం వల్ల జుట్టు విపరీతంగా దెబ్బతింటోంది. ఇదికాకుండా పోషకాహారలోపం కూడా కారణం అవుతుంది. బిజి షెడ్యూల్ వల్ల మహిళలు జుట్టుని పట్టించుకోవడం లేదు. దీంతో జుట్టు బాగా దెబ్బతిని అందవికారంగా తయారవుతుంది. అయితే ఇలాంటి జుట్టుకి కొంచెం సమయం కేటాయించి కొన్ని రకాల నూనెలని అప్లై చేయడం ద్వారా అందంగా తయారుచేసుకోవచ్చు. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.
1. జోజోబా ఆయిల్
జోజోబా ఆయిల్ జుట్టుకు తేమను, పోషణను అందిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తే డ్యామేజ్ అయిన జుట్టు అందంగా తయారవుతుంది. ఈ నూనెను ప్రత్యేకంగా తలకు పట్టించి, జుట్టు చివరి వరకు విస్తరించాలి. సుమారు అరగంట తర్వాత జుట్టు కడగాలి.
2. ఆలివ్ ఆయిల్
ఆలివ్ నూనె జుట్టుకి అమృతం వంటిది. ఇది డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేస్తుంది. జుట్టును చాలా మృదువుగా మార్చుతుంది. ఈ నూనెను మీ చేతులకు అప్లై చేసి జుట్టు మూలాల్లో మసాజ్ చేయాలి. తర్వాత జుట్టును కడిగి ఆరబెట్టాలి.
3. కొబ్బరి నూనె
జుట్టు పోషణ కోసం కొబ్బరినూనెని ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్నారు. ఎందుకంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కచ్చితంగా వర్జిన్ కొబ్బరి నూనెను ఉపయోగించాలి. స్నానానికి 30 నిమిషాల ముందు ఈ సహజ నూనెతో మీ జుట్టుకు మసాజ్ చేయాలి. ఆపై తేలికపాటి షాంపూతో తలను కడగాలి. మెరుగైన ఫలితాల కోసం నూనెను కొద్దిగా వేడి చేయాలి.
4. ఉల్లిపాయ నూనె
ఉల్లిపాయ నూనె పొడి జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఇది పెరుగుదలను మెరుగుపరచడమే కాకుండా జుట్టు రాలడాన్ని తొలగిస్తుంది. దీన్ని ఇంట్లో తయారు చేయడానికి ఒక గిన్నెలో ఉల్లిపాయ రసాన్ని తీసి ఆపై కొబ్బరి నూనెను కలిపి చిన్న మంటపై వేడి చేయాలి. తర్వాత సీసాలో భద్రపరుచుకుని క్రమం తప్పకుండా జుట్టుకు మసాజ్ చేయాలి.