వెన్నెముక బలంగా ఉండాలంటే...

Update: 2019-06-21 08:32 GMT

వ్యాయామాల ద్వారా శరీరం ఫిట్‌గా ఉంటుంది. అయితే వ్యాయామాల వెనుక భాగంలోని కండరాలకు ఆకృతిలోకి తేవడానికి ఎక్కువ సమయమే పడుతుంది. ఈ భాగంలో కండరాల అమరిక చిన్నచిన్న, పెద్ద కండరాలతో నిండి ఉంటుంది. రోజువారి వ్యాయామాలతో దృఢమైన వెన్నెముకను సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. వీపు భాగానికి సంబంధించి ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఓ సారి చూద్దాం...

వైడ్‌ గ్రిప్‌ పుల్‌ అప్స్‌ వ్యాయామం వీపు పై భాగంలోని కండరాల మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ వర్క్ ఔట్స్‌లో వెయిటెడ్‌ బెల్టును ఉపయోగిస్తే బరువు పడి, కండరాలు షేపులోకి వస్తాయి. కండరాలు బాగా కనిపించేందుకు పుల్‌అ్‌ప్సతో చేయడంతో పాటు బరువులు పెంచుకుంటూ పోవడం ముఖ్యమే.

బెంట్‌ ఓవర్‌ బార్‌బెల్‌ రోవింగ్‌తో వెన్నెముకకు చక్కని వ్యాయామం లభిస్తుంది. ఎక్కువ బరువులు ఎత్తాల్సి ఉంటుంది. గ్రిప్‌ ఉన్న డంబెల్స్‌ను ఎంచుకోవాలి. వీపు భాగాన్ని నేలపై ఉంచి, మోకాళ్లను కొద్దిగా ముందుకు వంచాలి. బరువులు ఎత్తేటప్పుడు శరీరాన్ని కదిలించకూడదు. స్ధిరంగా ఉండడం చాలా ముఖ్యం.

అలాగే బార్‌బెల్‌ గ్రిప్‌తో వీపు కండరాల్ని పటిష్ఠం చేసే పలు వ్యాయామాలు చేయొచ్చు. పెద్ద గ్రిప్‌ బార్‌బెల్‌తో ఎక్సర్‌సైజ్‌లు చేస్తే కండరాలు మంచి ఆకృతిలోకి వస్తాయి. చిన్న గ్రిప్‌ బార్‌బాల్‌తో వీపు మధ్యభాగంలోని భాగానికి వ్యాయామం లభిస్తుంది.

సింగిల్‌ ఆర్మ్‌ డంబెల్‌ రోతో కండరాలకు మంచి వ్యాయామాన్నిస్తుంది. శరీరాన్ని సరైన పొజిషన్‌లో ఉంచి. ఆరు లేదా ఎనిమిది రెప్స్‌ తీసుకొని డంబెల్స్‌తో ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. బెంచీపైన పడుకొని చేస్తే మంచిది. బరువుల్ని ఛాతీవైపు తీసుకొస్తూ చేసే వ్యాయామం వల్ల వెన్నెముక కండరాలు బలంగా తయారవుతాయి.

Tags:    

Similar News