పిల్లలకు చిన్నప్పటి నుంచే పొదుపు పాఠాలు

Update: 2019-08-09 15:46 GMT

పిల్లలు భవిష్యత్‌లో ఆర్ధికంగా నిలదోక్కుకోవాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. అందుకు తగిన అలవాట్లను చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు వారికి నేర్పించాలి. బాల్యం నుంచే డబ్బుకు సంబంధించిన అలవాట్లను కూడా వారికి నేర్పాలి. పిల్లలకు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణను అలవరచడం ఎంతో ముఖ్యం. వారికి చిన్నతనం నుంచే డబ్బు పొదుపు పాఠాలు నేర్పిస్తుండాలి. డబ్బు విలువ తెలిసేలా వారికి చేప్పాలి. చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని అతిగా గారాబంగా పెంచుతుంటారు. అడిగిందల్లా కొనిపెడుతూ వారికి డబ్బు విలువ ఏంటో తెలియకుండా చేస్తారు.

ముందు నుంచే డబ్బు గురించి పిల్లలకు స్పష్టంగా తెలియజేయాలి. ఉద్యోగస్తులైన తల్లిదండ్రులను ప్రతి నెలా కొంతైనా డబ్బుని పొదుపు చేయాలి. వారి సంపాదనలో ప్రతినెలా ఆదాయంలో 15 శాతం పొదుపు చేయాలి. భవిష్యత్తులో ఏదైనా అనుకోని అత్యవసర పరిస్థితి వస్తే, ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలకు పాకెట్‌ మనీ ఇచ్చేటపుడు వచ్చే నెల వరకూ వీటితోనే సరిపెట్టుకోవాలని చేప్పండి. ఇలా చేయడం వల్ల ఖర్చులను సర్దుబాటు చేసుకునే పద్ధతిని అలవాటు చేసుకుంటారు. వారిక ఆర్ధిక క్రమశిక్షణ అలవడుతుంది.

పొదుపు ఎలా చేయాలనేది వారికి నేర్పాలి.. కష్టపడి డబ్బు సంపాదించడంతో పాటు తెలివిగా డబ్బును ఎలా సంపాదించేలా కూడా పిల్లలకు నేర్పాలి. పిల్లలకు చేతి ఖర్చుల కోసమని ప్రతి నెలా ఎంతో కొంత ఇస్తుంటాం. అది కాకుండా మధ్యలో ఏదైనా అడిగితే వాటిని కొనిపెడుతుంటారు. ఇలా చేయడం వల్ల వారికి ఇచ్చిన మనీని అనవసర ఖర్ఛులు చేసి. ఏదైనా అవసరమైన ఖర్చు వచ్చినప్పుడు మీమ్మల్ని డబ్బు అడుగుతుంటారు. ప్రతి నెలా చేతి ఖర్చుల కోసం ఇచ్చే డబ్చును పొదుపు చేసి అవపరమైనవే కోనాలని చెప్పండి. దీంతో వారికి చిన్నతనం నుంచే పొదుపు అలవాటవుతుంది.  

Tags:    

Similar News