టీతో పాటు బ్రెడ్‌ తింటున్నారా.. అయితే ఈ ప్రమాదాలని నివారించడం కష్టమే..!

టీతో పాటు బ్రెడ్‌ తింటున్నారా.. అయితే ఈ ప్రమాదాలని నివారించడం కష్టమే..!

Update: 2022-10-21 04:51 GMT

టీతో పాటు బ్రెడ్‌ తింటున్నారా.. అయితే ఈ ప్రమాదాలని నివారించడం కష్టమే..!

Tea With Bread: భారతదేశంలో చాలా మందికి టీ అనేది పానీయం మాత్రమే కాదు అంతకు మించి. ఇదిలేకుండా రోజు గడవదు. కొందరికైతే దీనితోనే రోజు ప్రారంభమవుతుంది. దేశంలో నీటి తర్వాత అత్యధికంగా వినియోగించే పానీయం ఏదైనా ఉందంటే అది టీ మాత్రమే. ఉదయం టిఫిన్‌ నుంచి సాయంత్రం స్నాక్స్‌ వరకు ప్రజలు దీనిని సిప్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. టీతో పాటు బిస్కెట్లు, స్నాక్స్ తినడం సాధారణం. అయితే చాలా మంది బ్రేక్ ఫాస్ట్‌లో టీతో బ్రెడ్ తీసుకుంటారు. వాస్తవానికి టీ హానికరం ఇక దానితో బ్రెడ్ కలపడం సమస్యను మరింత పెంచుతుంది. ఎందుకంటే ఇది అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని సృష్టిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం.

1. అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు టీ, బ్రెడ్ కలిపి తినకూడదు. ఎందుకంటే ఇది బీపీని పెంచుతుంది. ఇతర సమస్యలకు దారితీస్తుంది

2. టీ, బ్రెడ్ కలిపి తినడం వల్ల పెప్టిక్ అల్సర్ వస్తుంది. కాబట్టి ఈ రెండింటినీ ఎప్పుడూ కలపకండి. కొంతమంది ఇలా చేయడం వల్ల అసిడిటీతో బాధపడుతారు.

3. మీరు బ్రెడ్‌ని టీతో తినడానికి ఇష్టపడితే ఊబకాయం వేగంగా పెరుగుతుంది. ఎందుకంటే వైట్ బ్రెడ్‌లో ప్రిజర్వేటివ్‌లు కలుపుతారు. ఇవి మన ఆరోగ్యానికి హానికరం. దీని కారణంగా కడుపు ప్రభావితం అవుతుంది.

4. టీ, బ్రెడ్ కలయిక గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని చాలా వరకు పెంచుతుంది. కొందరికి గుండెపోటు కూడా రావచ్చు. కాబట్టి నివారించడానికి ప్రయత్నించండి.

5. మధుమేహ వ్యాధిగ్రస్తులు టీ, బ్రెడ్ కలిపి తినడం సరికాదు. ఎందుకంటే ఇది ఇన్సులిన్‌పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది.

Tags:    

Similar News