Tea Lovers : టీతో పాటు వీటిని తింటున్నారా? అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే

Tea Lovers : మన భారతీయులకు ఉదయాన్నే వేడివేడి టీ పడకపోతే రోజూ గడవదు. కొందరికైతే గంట గంటకూ చాయ్ తాగాల్సిందే.

Update: 2026-01-04 11:30 GMT

Tea Lovers : టీతో పాటు వీటిని తింటున్నారా? అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే

Tea Lovers: మన భారతీయులకు ఉదయాన్నే వేడివేడి టీ పడకపోతే రోజూ గడవదు. కొందరికైతే గంట గంటకూ చాయ్ తాగాల్సిందే. అయితే, టీ తాగడం ఒక ఎత్తయితే.. టీతో పాటు మనం తినే తిండి మరో ఎత్తు. చాలామంది టీతో పాటు బిస్కెట్లు, సమోసాలు, పకోడీలు లాంటివి లాగించేస్తుంటారు. ఇది నాలుకకు రుచిగా అనిపించవచ్చు కానీ, మన ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచిది కాదు. కొన్ని ఆహార పదార్థాలను టీతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలామందికి టీలో బిస్కెట్లు లేదా రస్కులు ముంచుకుని తినడం ఒక అలవాటు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. బిస్కెట్లలో ఉండే మైదా, అధిక చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ మన జీర్ణ వ్యవస్థను బలహీనపరుస్తాయి. దీనివల్ల పొట్టలో గ్యాస్ పెరగడం, బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇది మధుమేహానికి దారితీసే అవకాశం ఉంది.

టీ తాగేటప్పుడు వేడివేడి సమోసాలు, పకోడీలు తినడం మనందరికీ అలవాటే. కానీ ఈ కాంబినేషన్ గుండె, కడుపు రెండింటికీ హానికరమే. వీటిలో ఉండే అధిక నూనె కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. టీలో ఉండే కెఫీన్‌తో నూనె పదార్థాలు కలిసినప్పుడు ఎసిడిటీ సమస్య తీవ్రమవుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, అజీర్తి వంటి సమస్యలు బాధిస్తాయి.

కేకులు, పేస్ట్రీలు లేదా ఇతర స్వీట్లను టీతో కలిపి తీసుకోకూడదు. టీలోని టానిన్లు చక్కెరతో కలిసినప్పుడు జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల కడుపు ఉబ్బరంగా అనిపించడం, బద్ధకం మరియు ఇన్సులిన్ నిరోధకత పెరుగుతాయి. ఫలితంగా బాడీలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంది. ఇక చాక్లెట్లలో కూడా కెఫీన్ ఉంటుంది. టీ, చాక్లెట్ రెండూ కలిపి తీసుకుంటే గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.

చాలామంది టీ తాగాక వెంటనే పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ అది తప్పు. టీలో ఉండే టానిన్లు, పండ్లలోని ఐరన్, ఇతర పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. అంటే మీరు ఎంత మంచి పండ్లు తిన్నా, వాటిలోని పోషకాలు శరీరానికి అందవు. అందుకే టీ తాగడానికి అరగంట ముందు లేదా అరగంట తర్వాతే పండ్లు తినడం మంచిది.

కొంతమంది బద్ధకంతో నీళ్లకు బదులు టీతోనే మందు బిళ్లలు వేసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పొరపాటు. టీలోని కెఫీన్, టానిన్లు మందుల పనితీరును తగ్గిస్తాయి. కొన్నిసార్లు రసాయన చర్యలు జరిగి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మందులను ఎప్పుడూ సాధారణ నీటితోనే తీసుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, కాబట్టి టీ తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.

Tags:    

Similar News