మహిళలు పాట పాడితే ఏం జరుగుతుదంటే..!

Update: 2019-07-03 11:50 GMT

పాటలు పాడటం చాలమందికి ఇష్టం. మహిళలు ఎక్కువగా పాటలు పాడుతుంటారు. చిన్న పిల్లలను బుజ్జగించటానికి.. వారికి గోరు ముద్దులు తినిపించటానికి అమ్మ పాడే పాటలు అమృతంలా ఉంటాయి. తన బిడ్డ కోసం జోల పాటలు పాడినా తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు తెలిపారు. అయితే ప్రసవం తర్వాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు.

సాధారణంగా ప్రసవం తర్వాత చాలామంది మహిళలు ఒకరకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు. ఆందోళన పడుతుంటారు. అయితే... పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ ఒంటరిగా కాకుండా.. గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపే మహిళలల్లో మరీ తొందరగా మార్పు వస్తుందట. ప్రతి ఎనిమిది మంది బాలింతల్లో ఒకరు కుంగుబాటుకు గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. వీళ్లకే కాదు వయసు పైబడిన వారు పాటలు పాడిన మంచి ప్రయోజనం ఉందట. పెద్దలు పాటలు పాడుతే.. డెమెన్షియా వంటి మానసిక రుగ్మతుల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించాయి.  

Tags:    

Similar News