కరచాలనం ఎలా చేయాలంటే..

Update: 2019-06-29 13:49 GMT

ఎవరైన వ్యక్తులు కనిపించినప్పుడు కరచాలనం చేయడం సంప్రదాయం. మనం చేసే కరచాలనంతోనే మనమెంటో బయటపెడుతుందనీ అంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు.

మనం కరచాలనం చేస్తున్న విధానంతోనే అవతలివారికి మన మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుందంటున్నారు. అందుకే మన మీద ఎదుటివారికి పాజీటివ్ ఓపినియన్ ఏర్పడేందుకు రచాలనం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి...

- కరచాలనం చేసేటప్పుడు అటు ఇటు చూస్తూ ఉండకూడదు. అలా చేస్తే మొక్కుబడిగా కరచాలనం చేసినట్లు ఉంటుంది. కావున చిరునవ్వుతో కరచాలనం చేయాలి.

- అవతలి మనిషి కరచాలనానికి చేయిచాచగానే మనం కూడా చేయి చాచేస్తాము. చేతులు ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకోము. ఇలాంటి చేతులతో కరచాలనం చేస్తే అవతలి వ్యక్తికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.

-కరచాలనం ఎప్పుడూ చాలా, స్పష్టంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి మరొక్కరితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలోకి వెళ్ళి కరచాలనం చేయడం మంచిది కాదు.

- అవతలి మనిషి హడావుడిగా ఉన్నప్పుడు కరచాలనం చేయాలి అనుకుంటే, ముందుగాపలకరించి, ఆ తరువాత కరచాలనం చేయాలి

- కరచాలనం చేసేటప్పుడు అరచేయి మొత్తాన్నీ అవతలి వ్యక్తి అరచేతితో కలపాలి.

- గట్టిగా కరచాలనం చేయడం ద్వారా మీరు అతివిశ్వాసంగా ఉన్నరన్న భావన అవతలివారిలో కలుగుతుంది.

- కరచాలనం చేసేటప్పుడు చేతులను రెండు మూడుసార్లు ఊపితే సరిపోతుంది. అంతే కానీ చేతిని వదలకుండా అలానే ఊపకూడదు.

. కరచేలనం చేస్తూ అరచేతిని పైకి తిప్పితే అవతలి వ్యక్తి మీద మనం ఆధిపత్యం చెలాయిస్తున్నామన్న సూచనను అందించినట్లు అవుతుంది.

కావున కరచేలనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..

Similar News