బాబోయ్! బీరకాయ వీళ్లకు యమ డేంజర్ – తిన్నారంటే సమస్యలే!
బీరకాయ ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతుంది. కొందరు ఇష్టంగా తింటారు, మరికొందరు దూరంగా ఉంటారు. తక్కువ కేలరీలతో పాటు పీచు, నీటి శాతం అధికంగా ఉండే బీరకాయలో విటమిన్ A, C, B కాంప్లెక్స్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, సోడియం, కాపర్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
బాబోయ్! బీరకాయ వీళ్లకు యమ డేంజర్ – తిన్నారంటే సమస్యలే!
బీరకాయ ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతుంది. కొందరు ఇష్టంగా తింటారు, మరికొందరు దూరంగా ఉంటారు. తక్కువ కేలరీలతో పాటు పీచు, నీటి శాతం అధికంగా ఉండే బీరకాయలో విటమిన్ A, C, B కాంప్లెక్స్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, సోడియం, కాపర్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కూరను అందరూ తినడం మంచిదే కాదు. కొందరికి ఇది హెల్త్ రిస్క్‌గా మారవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి కాదు
బీరకాయలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మంచిదే, కానీ సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగిన వారు బీరకాయ తినడం వల్ల:
గ్యాస్, ఉబ్బరం
వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశం ఉంది.
అలెర్జీ సమస్యలు
కొంతమందికి బీరకాయ తినడం వల్ల:
చర్మ దురద, మంట, వాపు, దద్దుర్లు
తీవ్రమైన సందర్భాల్లో శ్వాస సమస్యలు కూడా రావచ్చు.
కిడ్నీ రోగులకు డేంజర్
బీరకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది.
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేరు.
అందువల్ల, కిడ్నీ సమస్యలున్నవారు బీరకాయ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక
(ఇక్కడ చెప్పిన సమాచారం నిపుణులు అందించిన అవగాహన కోసమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.)