Health Tips: చుండ్రు సమస్యకి ఇది ఒక్కటి చాలు..!

Health Tips: చుండ్రు సమస్యకి ఇది ఒక్కటి చాలు..!

Update: 2022-10-01 03:16 GMT

Health Tips: చుండ్రు సమస్యకి ఇది ఒక్కటి చాలు..!

Health Tips: చుండ్రు సమస్యతో ఇబ్బందిపడుతున్నవారు నిమ్మకాయని ఉపయోగిస్తే చిటికెలో తొలగించుకోవచ్చు. నిమ్మరసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు చుండ్రును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇది కాకుండా దురదను తగ్గించడంలో కూడా పనిచేస్తుంది. నిమ్మకాయతో చుండ్రు సమస్యలని తొలగించే చిట్కాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. కొబ్బరి నూనె, నిమ్మకాయ

చుండ్రు సమస్యను తొలగించడానికి నిమ్మకాయ, కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో 2 టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని అందులో నిమ్మరసం కలపాలి. తర్వాత కాటన్ బాల్ సహాయంతో తలకు అప్లై చేయాలి. సుమారు 1 గంట పాటు వదిలివేయాలి. తర్వాత మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. చుండ్రు సమస్య దూరం అవుతుంది.

2. అలోవెరా జెల్, నిమ్మకాయ

చుండ్రుని తగ్గించడానికి కలబంద జెల్, నిమ్మరసం బాగా పనిచేస్తుంది. 2 నుండి 3 స్పూన్ల కలబంద జెల్ తీసుకొని అందులో నిమ్మరసం కలపాలి. తర్వాత తలకు పట్టించాలి. సుమారు 15 నిమిషాల తర్వాత జుట్టును కడగాలి. దీంతో చుండ్రు సమస్యను దూరం చేసుకోవచ్చు.

3. ఆలివ్ ఆయిల్, నిమ్మరసం

చుండ్రు సమస్యను దూరం చేయడానికి ఆలివ్ ఆయిల్, నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. మీరు కొద్ది రోజుల్లోనే ఫలితం పొందుతారు. 1 టీస్పూన్ ఆలివ్ నూనెలో 1 టీస్పూన్ నిమ్మరసం కలపాలి. తర్వాత తలకు పట్టించి కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో జుట్టును కడగాలి. దీంతో చుండ్రు సమస్య దూరమవుతుంది.

Tags:    

Similar News