భరించలేని చెమట వాసనకు ఇలా చేయండి..

Update: 2019-09-07 15:08 GMT

రోజుకు రెండు సార్లు స్నానం చేస్తున్నా.. అయినా చమట వాసన వస్తుందని బాధపడేవాళ్లు ఉన్నారు. కొంతమంది పక్కన కూర్చోంటే.. వారి వద్ద నుంచి వచ్చే చెమట వాసనను భరించలేనంతగా ఉంటుంది. వారి వద్ద నుంచి ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తుంటారు. అలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే చెమట దుర్గంధాన్ని పారదోలవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* స్నానం చేసే నీళ్లలో నిమ్మరసం పిండుకోని.. స్నానం చేస్తే చమట వాసనకు స్వస్తి పలుకవచ్చు అంటున్నారు నిపుణలు.

* అలాగే స్నానం చేసిన వెంటనే పౌడరు చల్లుకోవడం మానేసి, తేలికపాటి మాయిశ్చరైజర్‌ మెడ, చేతులకు అప్లే చేసినా చమట వాసన నుంచి మంచి ఫలితాలు వస్తాయి.

* అలాగే చమట పీల్చుకునే లోదుస్తులే ధరిస్తే చమట వాసన నుంచి ఉపశమనం పొందవచ్చు.

* స్నానం చేసిన వెంటనే ముఖానికి రోజ్‌ వాటర్‌ ఒంటికి అద్దుకున్న మంచి ఫలితాలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

* కాఫీ, టీలు తాగడం తగ్గించి, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, తాజా నీళ్లు ఎక్కువగా తాగితే మంచి ఫలితాలు వస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* నువ్వుల నూనెను ఒంటికి బాగా రాసుకుని చింతపండు గానుగ గింజలను నూరి ఆ ముద్దతో ఒంటికి నలుగుపెట్టుకోవాలి. వారంలో ఒకరోజు ఇలా చేస్తే చర్మం నుండి దుర్వాసనకు స్వస్తి చెప్పవచ్చు.

* కొందరిలో అధిక చెమట పడుతుంది. అలాంటివారు వేపాకు, తామరపువ్వులు, దానిమ్మ చెక్క తీసుకుని నీళ్లతో నూరి ఆ ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుంటే అధికంగా వచ్చే చెమట శాతం తగ్గుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

Tags:    

Similar News