ఒక పుంజు.. ఒక పెట్ట.. భావితరాలకు బహుమతిగా..

Update: 2019-05-31 09:13 GMT

ఒక పుంజు.. ఒక పెట్ట.. అంటే ఇదేదో సినీమా టైటిల్ అనుకుంటే పోరపాటే..! ఇది అత్యంత అరుదైన కోడి కథ.. ఇంకా చెప్పాలంటే అంతరించి పోతున్న జాతిని.. కాపాడలనే ఆరాటం. అందేకే వాటి మనుగడను భావితరాలకు బహుమతిగా అందించాలని నిర్ణయించారు అధికారులు. తిరుమల కొండ మీదే ఉండే కొన్ని రకాల జంతుల్లో బూడిదరంగు అడవి కోడి ఒకటి. శేషాచలం కొండల్లో అంతరించిపోతున్న జీవజాతిగా దీన్ని గుర్తించారు.తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల ఆధ్వర్యంలో 2014లో శేషాచలం కొండలను గాలించి రెండు కోళ్లను పట్టుకున్నారు.

ఇందులో ఒక పుంజు, ఒక పెట్ట ఉండడంతో వీటి ద్వారా సంతానోత్పత్తి చేయాలని నిర్ణయించారు. అందుకు కావాల్సిన చర్యలు తీసుకున్నారు. జంతు ప్రదర్శనశాలలోనే వీటిని భద్రపరచి వీటి గుడ్లను పొదిగించారు. వారి ప్రయత్నంలో కొన్ని అవంతరాలు ఏర్పడ్డాయి. గుడ్డును ఎంత జాగ్రత్తగా పొదిగించినా.. వాటిలో కొన్ని పాడైపోవడం జరిగేవి. పిల్లలు పుట్టిన తరువాత అవి కొన్ని రోజులకు మరణిచడం సర్వసాధరనమైంది. దీంతో ఏదైనా చేయాలని ఆలోచించారు. సమస్యకు చక్కటి పరిష్కర మార్గాన్ని ఎంచుకున్నారు. అత్యాధునిక ఇంక్యుబేటర్‌ను కొనుగోలు చేసి వీటి గుడ్లను పొదిగించారు. దీని ద్వారా ఒక్కసారే 300 గుడ్లను పొదిగించే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం అరుదైన బూడిదరంగు కోళ్ల సంఖ్య 85కు చేరింది. 

Similar News