Rakhi Gift Mistakes: రాఖీ పండుగకు ఈ బహుమతులు అస్సలు ఇవ్వకండి… బంధం బలహీనపడే ప్రమాదం!

రాఖీ పండుగ అనేది అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. ప్రేమ, పాస్తవం, నమ్మకంతో కూడిన ఈ బంధాన్ని బహుమతులతో మరింత బలంగా మార్చుకోవాలనుకుంటారు చాలామంది.

Update: 2025-08-05 16:32 GMT

Rakhi Gift Mistakes: రాఖీ పండుగకు ఈ బహుమతులు అస్సలు ఇవ్వకండి… బంధం బలహీనపడే ప్రమాదం!

రాఖీ పండుగ అనేది అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. ప్రేమ, పాస్తవం, నమ్మకంతో కూడిన ఈ బంధాన్ని బహుమతులతో మరింత బలంగా మార్చుకోవాలనుకుంటారు చాలామంది. కానీ వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గిఫ్టులు ఇవ్వడం వల్ల అనుబంధం బలహీనపడే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. రాఖీ రోజు చెల్లెలికి ఈ క్రింది బహుమతులను ఇవ్వకూడదని సూచిస్తున్నారు.

ఇవి గిఫ్ట్ చేయకండి!

1. గాజు, కంచు వస్తువులు

ఈ పదార్థాలు పగిలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండటం వల్ల, బంధం తుడిచిపెట్టే సూచనగా భావిస్తారు. అనుబంధంలో చికాకులు రావొచ్చని నిపుణుల హెచ్చరిక.

2. గడియారాలు, టైమర్‌లు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గడియారాలు శని గ్రహానికి చిహ్నం. గిఫ్ట్‌గా ఇవ్వడం ఆలస్యాలు, విబేధాలు తీసుకురాగలదని నమ్మకం.

3. పదునైన వస్తువులు (కత్తెర్లు, కత్తులు)

ఇవి ఘర్షణ, విభేదాలకు సంకేతాలుగా భావించబడతాయి. చీలిపోయే బంధానికి సూచనగా పరిగణిస్తారు.

4. నలుపు రంగు వస్త్రాలు/వస్తువులు

వాస్తు ప్రకారం నలుపు రంగు దుఃఖానికి, నెగటివ్ ఎనర్జీకి ప్రతీక. బహుమతిగా ఇవ్వడం వల్ల బంధంలో చికాకు, మూడ్ స్వింగ్‌లు రాగలవని నిపుణుల హెచ్చరిక.

గమనిక: ఈ సూచనలు వాస్తు, జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా ఇవ్వబడినవి. ఇవి శాస్త్రీయంగా నిరూపించబడలేదు. గిఫ్ట్ ఎంపికలో మీరు నమ్మే పద్ధతులను అనుసరించవచ్చు.

ఈ రాఖీ పండుగ… ప్రేమ, పాజిటివిటీ, మంచి ఊసులు కలిగిన బహుమతులతో ఒకరికొకరు ఆనందం పంచుకుందాం.

Tags:    

Similar News