పుట్టబోయే బిడ్డ తెలివిగా ఉండాలంటే ఇలా చేయాలి..

Update: 2019-09-14 07:16 GMT

గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహరం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భంలోని శిశువు ఎదుగుదల తల్లి తినే ఆహారంపైనే అధాపడి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహరం తీసుకోవాలో తెలుసుకుందాం..

ప్రేగ్నెంట్ స్త్రీలు తీసుకునే ముఖ్యమైన ఆహరం నట్స్(డ్రై ఫ్రూట్స్)ఒకటి. నట్స్ ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మంచివి. వాటితో గర్భిణీలకు రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయి. నట్స్‌లో ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉండటంతో తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాదు మంచి కొలెస్ట్రాల్ కూడా శరీరానికి అందిస్తోంది. బాదం, అంజీర, జీడిపప్పు, పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇవి తల్లి కంటే శిశువుకే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి.

గర్భధారణ సమయంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల గర్భంలోని శిశువు మెుదడు అభివృద్ది చెందుతుంది. వారు ఎదుగుతున్న కొద్ది మానసికంగా దృఢంగా ఉండానికి సహపడుతుంది.పిల్లల్లో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. వాటిలోని భాస్వరం, పొటాషియం, జింక్, సెలీనియం రాగి వంటివి అధిక శాతం ఉంటాయి. పిండం ఎదుగుదలలో ఇవన్నీ చాలా అవసరం. శిశువు ఎముకుల అభివ్రుద్దికి కూడా తోడ్పాడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పొటాషియం చాలా ముఖ్యం. అవన్నీ డ్రై ప్రూట్స్ పుష్కలంగా ఉంటాయి. డ్రైనట్స్ లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది తల్లి ,శిశువు చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. 

Tags:    

Similar News