నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి గుండె జబ్బులు ఎక్కువైపోతున్నాయి. ఈ జబ్బుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. దీనికి కారణం మారిన జీవనశైలిలో తీసుకుంటున్న ఆహారపు అలవాట్లు. ఈ నేపథ్యంలో గుండెతో పాటు.. గుండె పనితీరు బాగుండాలంటే తీసుకునే ఆహారంలో చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.
ఆహారంతో పాటు రోజు ఉదయం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవాలి. అలాగే పలు ఆరోగ్యకరమైన ఆహారాలను రోజు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు. గుండె పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు...
* గుండె పని తీరు సరిగాఉండాలంటే వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలను ఆహారంగా తీసుకోవాలి. వాటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
*వాల్‌నట్స్‌ను విధిగా తీసుకోవాలి. వాటిలో ఉన్న మోనో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. అలాగే రక్తనాళాల్లో ఉన్న అవాంతరాలను తొలగిస్తాయి. గుండెపోటు రాకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యంగా మెరుగ్గా ఉండేలా చూస్తుంది.
* ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్ మీల్ తినడం మంచిది. ఓట్స్‌లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. డార్క్ చాకొలెట్లను తినడం కూడా మంచిది. వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తం గడ్డకట్టకుండా చూస్తాయి. ఫలితంగా గుండెపోటుకు రాకుండా ఉండొచ్చని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.