Health: పసి బిడ్డల్లో కామెర్లు ఎందుకు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా.?

Newborn Jaundice: అప్పుడే పుట్టిన చిన్నారుల్లో కామెర్లు రావడం సర్వసాధారణమైన విషయం. చాలా మంది చిన్నారులకు ఎంతో కొంత కామెర్లు వస్తాయి.

Update: 2025-02-16 05:39 GMT

Health: పసి బిడ్డల్లో కామెర్లు ఎందుకు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా.?

Newborn Jaundice: అప్పుడే పుట్టిన చిన్నారుల్లో కామెర్లు రావడం సర్వసాధారణమైన విషయం. చాలా మంది చిన్నారులకు ఎంతో కొంత కామెర్లు వస్తాయి. అయితే చిన్నారుల్లో కామెర్లు రావడానికి అసలు కారణం ఏంటి.? వైద్యులు ఎలాంటి చికిత్సలు అందిస్తారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బిడ్డ కాలేయం పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం. గర్భిణీ స్త్రీలు పోషకాహారం తగినంత తీసుకోకపోవడం, లేదా శరీరంలో ఎర్ర రక్త కణాల అధిక విచ్ఛిన్నం వంటి అంశాలు కామెర్లు రావడానికి కారణంగా చెబుతున్నారు. సాధారణంగా కామెర్లు కొన్ని రోజుల్లో వాటంతటవే తగ్గిపోతాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం శిశువుకు చికిత్స అందించాల్సి ఉంటుంది. నవజాత శిశువుల కాలేయం బిలిరుబిన్‌ను సమర్థవంతంగా కంట్రోల్‌ చేయలేకపోవడం కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నవజాత శిశువుల్లో కాలేయం పూర్తిగా అభివృద్ధి చెందదు ఇది కూడా కామెర్లకు ఒక కారణం. అలాగే శిశువుల శరీరంలో కొత్త రక్తకణాల ఏర్పాటుకు సంబంధించిన మార్పులు బిలిరుబిన్ స్థాయిలను పెంచుతాయి. తల్లి, బిడ్డ రక్తగ్రూప్ అసాధారణంగా ఉంటే కామెర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

లక్షణాలు..

శిశువు చర్మం, కళ్లు తెల్లని భాగం పసుపు రంగులో మారుతాయి. శిశువు బరువు తగ్గడం, అలసట, బలహీనత, ఆకలి తగ్గడం, పాలు సరిగా తాగకపోవడం వంటివన్నీ పచ్చా కామెర్లు వచ్చాయని చెప్పేందుకు లక్షణాలుగా భావించాలి.

అధిక స్థాయిలో బిలిరుబిన్ శరీరంలో నిల్వ కావడం వల్ల, మెదడు మీద ప్రభావం పడే అవకాశముంది. తీవ్రమైన కామెర్ల కారణంగా "కెర్నిక్టెరస్" అనే నరాల సంబంధిత సమస్యకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. ఇది శిశువుల మానసిక అభివృద్ధితో పాటు వినికిడి సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది. కామెర్లు తీవ్రమైన స్థాయికి చేరితే, మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పిల్లల పెరుగుదల మందగిస్తుంది. అందుకే, దీన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

చికిత్స..

ఫోటోథెరపీగా చెప్పే ప్రత్యేకమైన కాంతి కింద ఉంచడం ద్వారా బిలిరుబిన్‌ను విచ్ఛిన్నం చేయవచ్చు. ఇక తల్లి పాలు సైతం శరీరంలోని అదనపు బిలిరుబిన్‌ను సహజంగా తొలగిస్తుంది. పరిస్థితి తీవ్రంగా మారితే.. రక్త మార్పిడి వంటి మెడికల్ ట్రీట్మెంట్ అవసరం కావచ్చు. అయితే సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే కామెర్లు చాలా సులభంగా తగ్గిపోతాయి.

Tags:    

Similar News