శాంసంగ్‌ టీవీ వినియోగదారులు షాకింగ్ న్యూస్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్‌

Update: 2019-11-09 10:57 GMT
Samsung and Netflix

శాంసంగ్‌ స్మార్ట్‌ టీవీ వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. 2019 డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి 'నెట్‌ఫ్లిక్స్‌' లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీసులు ఇతర కార్యక్రమలు రావు. సాంకేతిక పరిమితుల వల్లన ఓల్డ్ టెలివిజన్ లో తమ ప్రసారాలను చూడలేరని నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను పరిమితం చేస్తున్నందునా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. దీని వలన తక్కవ సంఖ్యలో శాంసంగ్‌ వినియోగదారులకు మాత్రమే అవాంతరం కలుగుతోందని తెలిపింది.

నెట్‌ఫ్లిక్స్‌ కార్యక్రమాలు రానివారు చూడాలంటే నూతన సెటాప్‌ బాక్స్‌ను అమర్చుకోవాలని తెలిపింది. ఆపిల్‌ టీవీ, గేమ్‌ కన్సోల్స్‌, క్రోమ్‌క్యాస్ట్, ఇతర టాప్‌ బాక్సుల్లో కార్యక్రమాలను చూడొచ్చని ఆ సంస్థ పేర్కొంది. అయితే శాంమ్సంగ్ కు చెందిన టీవీల్లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యక్రమాలు రావని చెప్పిన యాజమాన్యం, ఏటువంటి  టీవీ మోడళ్లలో నెట్‌ఫ్లిక్స్‌ కార్యక్రమాలు వస్తామో, రావో ఆ సంస్థ పూర్తి వివరాలు వెల్లడించలేదు. నెట్‌ఫ్లిక్స్‌ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై శాంసంగ్ టీవీ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.  

Tags:    

Similar News