చెమటకాయల సమస్యతో బాధపడుతున్నారా..!

Update: 2019-07-17 09:44 GMT

చెమటకాయలు వస్తే ఆ బాధ భరించటం కొంచెం కష్టంగానే ఉంటుంది. చెమటకాయల వల్ల చర్మం దురద పెడుతుంది. అయితే చెమటకాయల సమస్యతో బాధపడే వారు కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ చెమటకాయలను ఇంట్లో దొరికే వస్తువులతోనే నివారించవచ్చు అంటున్నారు నిపుణులు.

కలబంద గుజ్జు చెమటకాయ సమస్యలకు చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. కలబంద గుజ్జును తీసుకుని చెమట కాయలు ఉన్న ప్రదేశంలో రాస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కలబందలో ఉండే ఆస్ట్రిజెంట్ లక్షణాలు చెమట కాయలను నిర్మూలించడంలో మెరుగ్గా పనిచేస్తాయి అంటున్నారు. చర్మంపై ఉండే ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గే అవకాశం ఉంది.

అలాగే అలోవెరా జెల్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. టీ ట్రీ ఆయిల్‌ తో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందట. కొద్దిగా టీ ట్రీ ఆయిల్‌ను తీసుకుని దానికి కొంత నీటిని కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. ఆ మిశ్రమంలో కాటన్‌బాల్‌ను ముంచి చర్మంపై రాస్తే చెమట కాయలు తగ్గిపోతాయట.

టిష్యూ పేపర్‌ను తీసుకుని వెనిగర్‌లో ముంచి చెమటకాయలు ఉన్నచోట అప్లే చేస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయట. అలాగే బ్లాక్ టీని తీసుకుని చర్మంపై రాస్తే కూడా చెమటకాయల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. 

Tags:    

Similar News