అత్యంత ప్రమాదకరమైన వ్యాధి.. ఎయిడ్స్ తరువాత ఇదే!

Update: 2019-06-25 16:21 GMT

ఎయిడ్స్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దీనికి చికిత్స లేదు.. నివారణ ఒక్కటే మార్గం అని వైద్యులు చెబుతుంటారు. అయితే ఎయిడ్స్ తరువాత అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఉంది. అవును.. ఇప్పటివరకు ఈ వ్యాధి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ వ్యాధి పేరే ఎంజీ. ఈ వ్యాధిని గుర్తించడానికి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కానీ దీని వల్ల కటిభాగంలో పుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. మహిళల్లో పిల్లలు పుట్టకుండా పోయే ప్రమాదం కూడా ఉంది.

అసలు ఎంజీ అంటే ఏమిటో తెలుసా.. మైకోప్లాస్మా జెనిటాలియం అనే ఒక సూక్ష్మజీవి. దీనివల్ల మగవాళ్లలో మూత్ర విసర్జన సమస్యలు వస్తాయి. మహిళలలో అయితే గర్భాశయానికి సంబందించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఉన్నవారితో కండోమ్స్ లేకుండా సెక్స్‌లో పాల్గొంటే.. ఇది వాళ్లకు కూడా సోకే ప్రమాదముంది.

ఈ వ్యాధిని బ్రిటన్‌లో 1980లలో గుర్తించారు. ఎంజీ వ్యాధి ఉన్నా అన్నిసార్లూ దాని లక్షణాలు కనిపించవు. అయితే ఇటీవలే ఈ వ్యాధికి పరీక్షలు కనుగొన్నారు. కానీ ఇవి అన్నిచోట్లా అందుబాటులో లేకపోవటం బాధకరం.

Tags:    

Similar News