పెరుగు తినడంవలన ఎన్ని ప్రయోజనాలో..

పెరుగు తినడంవలన ఎన్ని ప్రయోజనాలో.. పెరుగు తినడంవలన ఎన్ని ప్రయోజనాలో..

Update: 2019-09-26 03:49 GMT

పాల ఉత్పత్తులతో అరోగ్యకరమైన ప్రయోజనాలు చాలనే ఉన్నాయి. పాలు,పెరుగు,నెయ్యి, వెన్న ఇలా అన్నింటినిలోనూ శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా పెరుగు తినడం వల్ల అనేక ఆహార ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కడుపులో మంటను తగ్గించడంతో పాటు, జీర్ణశక్తిని పెంచుతుంది. గుడ్ కోలేస్ట్రాల్‌తో పాటు మంచి పోషక పదార్ధాలు ఉంటాయి. అలాగే పొట్టలో కొవ్వు చేరకుండా చేస్తుంది.

పెరుగులో అధిక స్థాయిలో పోషకాలు ఉన్నాయి. ప్రతి రోజు మనం తీసుకునే డైట్‌లో పెరుగును ఖచ్చితంగా చేర్చుకోవాలి. అంతేకాదు అనేక సంస్కృతులు సంప్రదాయాలతో దీనికి ప్రాధాన్యం ఉంది. పెరుగు క్యాన్సర్ నివారణ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అనేక అధ్యాయనాల సమాచారం ప్రకారం పెరుగు పురుషుల్లో క్యాన్సర్‌కు ముందు పెరిగే కణతులను పెరగకుండా చేస్తుందని పరీశోధనలు సూచిస్తున్నాయి.

కండారాలను పెంచుకోవాలన్న లేదా బలహినంగా ఉన్న కండరాలను బలోపేతం చేసుకోవాలన్నపెరుగులో ఉండే హెల్తీ ప్రోటీన్ ఉపయోగపడుతాయి. జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్న వారికి పెరుగు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది, కాబట్టి జీర్ణ సమస్యలను నివారించే పెరుగును న్యాచురల్ రెమెడీగా తినవచ్చు. వాటిలో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా జీర్ణ సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే వాటిలో అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనార్ధమే. కావున ఏ ఆహారం తీసుకున్న పరిమితి మించే ఉండాలి.

Tags:    

Similar News