కోపాన్ని నియంత్రించడానికి చిట్కాలు

Update: 2019-06-09 14:08 GMT

ఆధునిక ప్రపంచంలో ప్రజల జీవన శైలిలో అనేక మార్పులొచ్చాయి. ప్రస్తుత కాలంలో ఎదురవుతున్న సమస్యలు చాలావరకు మనలో కోపానికి కారణమవుతున్నాయి. కోపం ఎవరికైనా వచ్చే సహజమైన చర్య. అలాగే అదోక ఆరోగ్యకరమైన భావోద్వేగం. కానీ దాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడో ఒకప్పుడు రావడం సహజమే అంతే కానీ అదే పనిగా కోప్పడుతూ ఉండటం మాత్రం చాలా ప్రమాదకరం. పని ఒత్తిడి,కుటుంబ కలహాలు మనిషిలో కోపాన్ని పెంచేస్తున్నాయి. అయితే మాటిమాటికీ కోపంతో ఊగిపోవడానికి 'మోనోమైన్ ఆక్సిడేస్ ఎ అనే ఎంజైమ్ కారణమని పరిశోధకులు చెబుతున్నారు

కోపాన్ని అదుపు చేసేందుకు మార్గాలు

* ఆల్కహాల్, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు లాంటి చేడు అలవాట్లకు దూరంగా ఉండాలి

* ప్రతి రోజు కంటి నిండా నిద్రపోవాలి

* సంతోషాన్నిచ్చే పనులు చేయాలి

* డాన్స్ ,గంతులు వేయండి, నచ్చిన పాటకు స్టెప్పులేయండి.

* కోపం వచ్చినప్పుడు మనసును శాంతింపజేసేందుకు దీర్ఘ శ్వాస తీసుకుంటూ 10 వరకు అంకెలను లెక్కపెట్టాలి.

* కాసేపు ప్రశాంతంగా నడవాలి.

* బాగా ఇష్టమైన ప్రశాంతమైన మ్యూజిక్ వినాలి. దాంతో మెదడుపై ఒత్తిడిని పడదు

* పుస్తకం చదవడం, చిత్రలేఖనంతోనూ మనసును ప్రశాంతపరచుకోవచ్చు.

* యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి.

* నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతంలో గట్టిగా అరవాలి. కేకలు వేయాలి దీంతో మీకున్న కోపమంతా పోతుంది

* బెడ్ మీద దిండును పిడికిలితో కొట్టాలి.

అలాగే కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో చెప్పే మానసిక నిపుణులను సంప్రదించండి.. 

Tags:    

Similar News