ఆ టీ తాగితే తలనొప్పి మాయం..!

Update: 2019-07-29 16:18 GMT

తలనొప్పి వస్తే.. ఆ బాధ భరించటం కష్టమే. చాలమంది తలనొప్పి వస్తే టీ తాగుతుంటారు. అలా తాగటం వల్ల తలనొప్పి నుంచి కాస్త ఉపశమనం కల్గుతుందని భావిస్తారు. అలాగే బాగా ఒత్తిడిగా ఉన్న లేక ఆందోళనగా ఉన్న టీ తాగే వారు ఉన్నారు. ఆ టైం లో టీ తాగితే రిలీఫ్ గా ఫీలవుతుంటారు. అలాగే జపనీయులు సేవించే 'మట్చా టీ' ఓ కప్పు తాగితే చాలు ఆందోళన తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు.

గ్రీన్‌టీ లాంటి మట్చ టీలో ఆందోళనను తగ్గించే గుణాలున్నాయి అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. దీనిలోని రసాయనాలు డోపమైన్‌ డి1 రిసెప్టార్స్‌, సెరెటోనిన్‌ 5హెచ్‌టీ1ఎ రిసెప్టార్స్‌ను ఉత్తేజితం చేసి ఉద్రేకాన్ని తగ్గిస్తాయని వారు అంటున్నారు. ఇటీవల జరిపిన పరిశోధనల్లో ఈ విషయాన్ని గ్రహించారట. మట్చ టీ ఆందోళనను తగ్గిస్తుందో? లేదో? తెలుసుకునేందుకు పిల్లులు, ఎలుకల మీద ప్రయోగాలు చేసినట్లు జపాన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. మట్చ పొడి లేదా కషాయం ఇచ్చిన తరువాత వాటిలో ఆందోళన తగ్గిపోవడాన్ని గమనించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags:    

Similar News