Health Tips: నిద్రకి ముందు తలస్నానం చేయడం సరైనదా.. కాదా..!

Health Tips: కొంతమంది నిద్రపోయే ముందు ధ్యానం, యోగా చేయడం అలవాటుగా ఉంటుంది.

Update: 2022-11-24 16:21 GMT

Health Tips: నిద్రకి ముందు తలస్నానం చేయడం సరైనదా.. కాదా..!

Health Tips: కొంతమంది నిద్రపోయే ముందు ధ్యానం, యోగా చేయడం అలవాటుగా ఉంటుంది. కానీ చాలామంది మాత్రం స్నానం చేస్తారు. నిద్రపోయే ముందు తలస్నానం చేయడం సరైనదా కాదా.. ఇది సురక్షితమేనా.. అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. దీని గురించి వైద్య నిపుణులు రకరకాలుగా చెబుతున్నారు. అయితే వాస్తవాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.

1. నిద్రపోయే ముందు తలస్నానం చేయడం వల్ల అలసట దూరం అవుతుంది. దీని వల్ల బాగా నిద్రపోగలుగుతాం. మంచి నిద్ర రావడం వల్ల శరీరంలో తాజాదనం ఉంటుంది.

2. రాత్రి పడుకునే ముందు తలస్నానం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం రిలాక్స్‌గా ఉంటుంది. సిరల్లో రక్త ప్రవాహం పెరుగుతుంది.

3. స్నానం చేయడం వల్ల ఒక వ్యక్తి శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా మంచి అనుభూతి చెందుతాడు. అంతే కాదు చర్మం, జుట్టు ఆరోగ్యంగా మారుతాయి. ఎందుకంటే రోజంతా వాటిపై ఉండే మురికి సులభంగా తొలగిపోతుంది.

4. అయితే కొందరు వేడినీటితో స్నానం చేస్తారు. మరికొందరు చల్లటి నీటితో స్నానం చేస్తారు. ఇది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.

5. కానీ కొంచెం గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఇది కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. రంధ్రాలను తెరుస్తుంది. మంచి నిద్రకు దారితీస్తుంది.

Tags:    

Similar News