జ్వరంగా ఉన్నవారు అన్నం తినవచ్చా..?

Update: 2019-07-04 13:46 GMT

వర్షాల కాలం ప్రారంభమైంది జలుబు,జ్వరాలు రావడం సహజం. అయితే జ్వరం వచ్చినప్పుడు చాలా మందికి ఏమి తిన్నా నోటికి రుచించదు. బాగా నీరసంగా ఉంటారు అన్నం తినడానికి కూడా ఇష్టపడారు. కొంతమంది అన్నం తింటే సమస్యలు వస్తాయంటారు. ఇందులో వాస్తవం ఎంత ఉందో ..దీనిపై వైద్యులు ఏమాంటున్నారో ఓసారి తెలుసుకుందాం.

జ్వరం వచ్చినప్పుడు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని వారు సూచిస్తున్నారు..పాలు, బ్రెడ్, కొబ్బరినీరు, ఇడ్లీ, ఆయిల్ తక్కువగా ఉండే పదార్ధాలను తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. అన్నం తినడం వల్ల జీర్ణం కావడానికి కోంత సమయం పడుతుంది కావున అన్నం తినకపోవడమే మంచిదని అంటున్నారు. అంతేకాకుండా జ్వరంగా ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయదు. ఏ ఆహారం అయినా జీర్ణమవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అన్నం తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు 

Tags:    

Similar News