నెయ్యి తింటే బరువు పెరుగుతామా?

Update: 2019-06-27 14:58 GMT

చాలామంది నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతాం అనుకుంటారు. కానీ నెయ్యి తినడం వల్ల బరువు పెరుగతారన్నది కేవలం అపోహ మాత్రమే అని చెబుతున్నారు నిపుణులు..చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతామోనని నెయ్యి వాడకాన్ని తగ్గిస్తారు.ముఖ్యంగా, ఆయిల్, ఆయిలీ ఫుడ్స్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆహారం విషయంలో అవి తినొద్దు ఇవి తినాలి అంటూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

నెయ్యిలో ఉండే కొలెస్ట్రాల్స్ శరీరానికి మంచిదని ..అది ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుందని పరీశోధకులు చెబుతున్నారు. దాన్ని రోజూ తినడం వల్ల అధికబరువు త్వరగా తగ్గుతుంది. అయితే.. రోజుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి మాత్రమే తీసుకోవాలి. దానికి మించి తీసుకోకూడదు . . అంతేకాదు.. అల్సర్స్ ఉండేవారు నెయ్యి తాగితే సమస్య త్వరగా తగ్గుతుంది.కావున. నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతారన్న అపోహ మాత్రం వద్దని.. రోజూ నెయ్యి తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు . 

Tags:    

Similar News