వారిని చలి ఏం చేయలేదు.. ఎందుకంటే?

Update: 2019-07-06 12:57 GMT

చలి.. వామ్మో చలి తట్టుకోవటం చాల కష్టం. ఎంతటి వారైనా చలికి గజగజ వణికిపోవల్సిందే.. ఎందుకంటే మన శరీరం 25 నుంచి 35 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది. అంతకన్నా ఉష్ణోగ్రత తగ్గితే శరీరం వణకడం మొదలుపెడుతుంది. అయితే.. ఇందుకు భిన్నంగా కొంత మంది ప్రజలు కొన్ని ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు.

ఆర్కిటిక్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల గడ్డకట్టే చలి ఉంటుంది. అంతటి చలిలో కూడా అక్కడ కొందరూ జీవిస్తుంటారు. ఇన్యూట్స్, నెనెట్స్ జాతులగా పిలిచే వీరిని ఆ చలి ఏమీ చేయలేదు. ఎందుకంటే వారు ఆ చలికి అలవాటు పడిపోయారు. ఆ జాతి ప్రజలకు జన్యుపరంగా కొన్ని లక్షణాలు సంక్రమించిటం వలన చలిని తట్టుకోగల్గుతున్నారు. ఇతర ప్రాంతాల ప్రజల కంటే వీరి శరీర ధర్మం భిన్నంగా ఉంటుంది. వీరి చర్మంలో స్వేదగ్రంథులు తక్కువగా ఉంటాయి. వీరి చర్మం ఇతర జాతుల చర్మం కంటే వేడిగా ఉంటుంది. వీరి శరీరంలో జీవక్రియలు కూడా చాలా వేగంగా జరుగుతాయి. అందుకే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా వీరు హాయిగా ఆడుతూ పాడుతూ గడిపేస్తున్నారు.  

Tags:    

Similar News