యోగా నేర్పించే యాప్స్..

Update: 2019-06-29 13:47 GMT

యోగా రోజు చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు నుంచి దూరంగా ఉండవచ్చు. సాఫీగా లైఫ్ సాగేందుకు యోగా ఉపయోగపడుతుంది. అయితే మోగ నేర్చుకోవడం ప్రత్యేకంగా శిక్షణ ఏమి అవసరం ఇంట్లోనే ఏంచక్కా యోగా చేయొచ్చు. అందుకోసం ఉపయోగపడే కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

బ్రీత్ యాప్ : ఈ యాప్‌లో రకారకాల యోగా అసనాలను ఉంటాయి వివరించారు. యోగ చేసే ముందు శ్వాస తీసుకుని, వదలడం చేస్తుండాలి. దీని ద్వారా ఆసనాల్లో ఎక్కువ సేపు ఉండగలుగుతాం. దీనికోసం ఈ బ్రీత్ యాప్ ఉపయోగపడుతుంది. శ్వాస ఎంతసేపు తీసుకోవాలి. అనేది స్పష్టంగా ఉంటుంది. అది కాకుండా.. రోజూలో మనకు దొరికే ఖాళీ సమయంలోనే యోగా చేయొచ్చని ఈ యాప్ సూచిస్తుంది.

యోగా గో యాప్.. ఈ యాప్‌లో ఫిట్‌నెస్‌తో ఉంచుకోవడంతో పాటు అధిక బరువు నియంత్రించుకునే నియమాలు కూడా ఉంటాయి. ప్రతి రోజు ఏడు నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు యోగా చేసే అసనాలను ఇందులో ఉంటుంది.

5 మినిట్‌‌ మనకు సమయం తక్కువగా ఉన్న సమయంలో అంటే కేవలం ఐదు నిమిషాల్లోనే చేసే యోగాసనాల గురించి ఈ యాప్ సమాచారం ఇస్తుంది. ఇందులోని ఆసనాలన్నీ ఆరోగ్యాన్నివ్వడమే కాకుండా శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది.

పాకెట్ యాప్ : యోగాసనాలుసంబంధించిన ఎన్నో సూచనలు ఈ యాప్ ఉంటాయి. ఏ భంగిమ ఎలా వేస్తుండాలో. దాని వల్ల కలిగే లాభాలేంటో ఈ యాప్ సూచిస్తుంది.

యోగా వేవ్ : అప్పుడే యోగా నేర్చుకునేవారి నుంచి నిష్ణాతులైనవారి వరకూ అందరికీ చక్కగా ఈ యాప్ ఉపయోగపడుతుంది. వీటిలోని నియమాలు పాటిస్తే శరీరం చక్కగా.. ఫ్లెక్సీబుల్‌గా ఉంటుంది. 

Tags:    

Similar News