తలలో పేలు ఎలా వస్తాయంటే..!

Update: 2019-06-26 16:18 GMT

తలలో పేలు.. ఎక్కువగా మహిళలను ఈ సమస్య వెంటాడుతుంటుంది. పేలుంటే తల మీద చిటచిట పెట్టినట్లు అనిపిస్తుంది. పేలు మరీ ఎక్కువగా ఉంటే.. జుట్టు పీకేస్తే బాగుండన్నంత చిరాకు పుట్టుకొస్తుంది. మరి, ఇంతగా ఇబ్బంది పెట్టే పేలు ఎలా పుడతాయో తెలుసా..! పేలు గుడ్ల నుంచి పుడతాయి. అవును.. ఈ గుడ్లను నిట్ అంటారు. మనిషి రక్తమే పేలకు ఆహారం. అవి మన తల మీద జుట్టు మధ్యలో తిరుగుతూ రక్తాన్ని పీల్చుతాయి.

పేలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటాయి. చిన్న పిల్లలను చాలామంది దగ్గరకు తీసుకుని ఆడిస్తుంటారు. ఎత్తుకుంటారు. అలాంటప్పుడు వారి తలలు ఎక్కువ మందికి తాకే అవకాశం ఉంటుంది. అందుకే, పెద్దలతో పోల్చితే పిల్లలకు పేల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందితో కలిసి ఉండటం వల్ల కూడా పేల సమస్య పెరుగుతుంది. పొడవాటి జుట్టు ఉండటం కూడా పేలు వ్యాప్తి చెందడానికి మరో కారణం.

అయితే.. తల్లో పేలు ఎగరలేవు.. అలాగని దూకలేవు కూడా. మరో వ్యక్తి జుట్టు తాకగానే.. ఆ వెంట్రుకలను పాకుతూ వెళ్లిపోతాయి అంతే. తల మీదకు చేరి గుడ్లుని పెడతాయి. మీ తలలో పేలున్నాయని మీకు తెలిసేలోపే అవి ఇతరులకూ వ్యాపిస్తాయి.  

Tags:    

Similar News