మనిషి పాదాలు పెరిగిపోతున్నాయా..!

Update: 2019-06-22 15:02 GMT

నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చాల మంది అనేక సమస్యలకు గురవుతున్నారు. ఈ ఆధునిక జీవనశైలి కారణంగా దంతాలు, కళ్లలో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా బాడీలో అనేక మార్పులు చోటుచేసుకుంటాన్నాయి. పొట్ట పెరిగిందని కొందరు బాధపడుతుంటే.. పెరిగిన పొట్టను తగ్గించుకోవటానికి మరికొంత కష్టాలు పడుతున్నారు. మనిషిలో వచ్చే మార్పుల్లో.. ఇప్పుడు మరో సమస్య వచ్చింది. అదే పాదాల పరిమాణం పెరిగిపోవటం. అవును మీరు చదువుతున్నది నిజమే.. గత 4 దశాబ్దాలలో మనిషి పాదాల పరిమాణం పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

పాదాల కండరాలు దృఢంగా, సాగే గుణం కలిగి ఉంటాయి. అవి, ప్రతి అడుగుకూ శరీర బరువులో 15 శాతాన్ని మనల్ని ముందుకు నడిపించే శక్తిగా మారుస్తాయి. సుమారు 40 వేల ఏళ్ల క్రితం తొలిసారిగా బూట్లను తయారు చేశారట. బూట్ల వాడకం మొదలైనప్పటి నుంచే పాదాలు బలహీనపడ్డాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. గతంతో పోలిస్తే ఇప్పుడు కాలినడకన తిరగడం చాలా తగ్గిపోయింది. పనిచేసే ప్రదేశాల్లోనూ అటూ ఇటూ నడిచే అవసరాలు లేకుండాపోతున్నాయి.

ఎక్కువగా షూ వాడటం, తక్కువ వాకింగ్ వల్ల పాదాల కండరాలు బలహీనపడతాయి. మన పాదాలు ఫ్లాట్‌గా మారాయి కాబట్టి వాటి పరిమాణం పెరిగినట్లుగా కనిపిస్తున్నాయి అంటున్నారు నిపుణులు. ఇది మనం నిలబడే తీరును ప్రభావితం చేస్తుందట.. ఇవి కీళ్ళు, వెన్నెముకలో సమస్యలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. దీని ఫలితం.. మనలో చురుకుదనం తగ్గే అవకాశం ఉందంటున్నారు. అందుకే, సౌకర్యవంతంగా ఉండే షూలనే వాడాలి. డోమింగ్, మడమను పైకెత్తడం లాంటి వ్యాయామాలు చేస్తే కండరాలు మళ్లీ దృఢంగా మారేందుకు అవకాశం ఉంటుందట. దాంతో, ఇప్పటికే కోల్పోయిన పాదాల దృఢత్వాన్ని తిరిగి పొందవచ్చు అంటున్నారు నిపుణులు. 

Tags:    

Similar News