దంతాలు దృఢంగా ఉండాలంటే..

Update: 2019-07-13 16:47 GMT

చాలా మందికి దంత సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్య తగ్గడానికి రెడ్ వైన్ చాలా ఉపకరిస్తుందట.రెడ్ వైన్ సేవించడం వలన గుండె, వివిధ రకాల క్యాన్సర్‌ల బారిన పడకుండా కాపాడబడుతుందని వివిధ పరిశోధనల్లో తెలియజేశాయి. తాజాగా జరిపిన అధ్యాయనంలో దంత సంరక్షణలోను రెడ్ వైన్ ఉపయోగపడుతుందటా . ఈ విషయాన్ని ఇటలీలోని పేవియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం వెల్లడించింది.

వారు తెలిపిన వివరాల ప్రకారం స్ట్రెప్టోకోకస్ మ్యూటెంస్ బ్యాక్టీరియాతో దంత సమస్యలు ఎక్కువగా వస్తాయని వెల్లడించారు. చక్కెర ఎక్కువుగా తినడం ద్వారా దంతాలలోకి ఈ బ్యాక్టీరియా చాలా సులువుగా చొరబడుతుందన్నారు. చక్కెర తినేవారిలో ఈ బ్యాక్టీరియా ప్రవేశించి దంతాలకు రంధ్రాలు ఏర్పారుస్తుందట. దీని వల్ల దంతాలు పాడైపోతాయని పరిశోధకులు తెలిపారు.

రెడ్ వైన్‌లోనున్న రసాయనాలు దంతాలకు హాని చేసే స్ట్రెప్టోకోకస్ మ్యూటెంస్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. దీనివల్ల రెడ్ వైన్ దంతాల్లోకి చేరే బ్యాక్టీరియాను అంతం చేస్తాయని పరిశోధనలో వెల్లడైనట్లు శాస్త్రవెత్తలు తెలిపారు. రెడ్ వైన్ తాగడం వల్ల దంతాలు ధృడంగా ఉండడంతో పాటు తెల్లగా మెరిసిపోతాయని వారు చెబుతున్నారు. 

Tags:    

Similar News