Childrens Skin Care: చలికాలంలో చిన్న పిల్లల చర్మం గరుకుగా మారుతుంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Childrens Skin Care: చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లల చర్మం మృదువుగా ఉంటుంది.

Update: 2024-01-17 16:00 GMT

Childrens Skin Care: చలికాలంలో చిన్న పిల్లల చర్మం గరుకుగా మారుతుంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Childrens Skin Care: చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లల చర్మం మృదువుగా ఉంటుంది. కానీ చల్లటి గాలుల వల్ల గరుకుగా మారుతుంది. కొన్నిసార్లు ర్యాషెస్‌ కూడా వస్తాయి. పిల్లల చర్మం పెద్దల కంటే 5 రెట్లు సున్నితంగా ఉంటుంది. చలికాలంలో చిన్న పిల్లల్లో డ్రై స్కిన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో పిల్లల చర్మ సంరక్షణలో జాగ్రత్తగా ఉండాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మాయిశ్చరైజింగ్ క్రీమ్

మాయిశ్చరైజింగ్ క్రీమ్ పిల్లల చర్మ సంరక్షణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటిలో డైమెథికోన్, సిరామైడ్‌లు, గ్లిజరిన్ వంటి పదార్థాలు ఉండాలి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. విటమిన్ ఈ సమృద్ధిగా ఉండే క్రీమ్ పిల్లల చర్మానికి మేలు చేస్తుంది. సువాసన లేదా రంగు క్రీమ్‌లకు బదులుగా సువాసన రంగు లేని క్రీమ్‌లను ఎంచుకుంటే మంచిది. క్రీమ్‌లో pH బ్యాలెన్స్ ఉండటం చాలా ముఖ్యం. ఇది చర్మం మరింత పొడిబారకుండా చేస్తుంది. తేలికపాటి చేతులతో పిల్లల ముఖం, శరీరంపై ఈ క్రీమ్‌ను అప్లై చేసి రుద్దాలి.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె పిల్లల చర్మానికి చాలా మేలు చేస్తుంది. బిడ్డకు స్నానం చేయించిన తర్వాత కొబ్బరి నూనె రాయాలి. ఇది తేమను మెయింటెన్‌ చేస్తుంది. తలస్నానానికి గంట ముందు నూనె రాసి మసాజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ప్రయోజనకరమే. కొబ్బరి నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఇలా నూనెతో మసాజ్ చేయడం వల్ల పిల్లల చర్మం మృదువుగా మారుతుంది.

లేత ఉన్ని దుస్తులు ధరించడం

ఉన్ని దుస్తులు ఎక్కువగా ధరించడం వల్ల హీట్ ర్యాష్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోజూ పిల్లల చర్మాన్ని చెక్‌చేస్తూ ఉండాలి. వేడి దద్దుర్లు విషయంలో తేలికపాటి మృదువైన ఉన్ని బట్టలు వేయాలి. చర్మంతో ఉన్ని బట్టలు నేరుగా స్పర్శించడం వల్ల దద్దుర్లు, దురదలు వస్తాయి. ఇలాంటి సమయంలో ముందుగా కాటన్ బట్టలు వేసి వాటి పై నుంచి ఉన్ని బట్టలు వేయాలి.

Tags:    

Similar News