Health Tips: ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతే ఈ వ్యాధుల ప్రమాదం ఎక్కువ..!
Health Tips: ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతే ఈ వ్యాధుల ప్రమాదం ఎక్కువ..!
Health Tips: ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతే ఈ వ్యాధుల ప్రమాదం ఎక్కువ..!
Health Tips: ఫిట్‌గా ఉండాలంటే తగినంత నిద్ర కూడా అవసరమే. కావాలిసిన దానికంటే ఎక్కువగా నిద్రపోతే శరీరంలో బలహీనత, ఊబకాయం, ఇతర రోగాలు సంభవిస్తాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తి 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు. మీరు ఏదైనా పనిలో ఉన్నా లేదా రెండు రోజులు తక్కువ నిద్రపోయినా మరుసటి రోజు తగినంత నిద్రపోవడం వల్ల దాన్ని భర్తీ చేసుకోవచ్చు. కానీ క్రమం తప్పకుండా తక్కువ నిద్రపోతున్నట్లయితే నేరుగా వ్యాధులకు గురవుతారు.
ఇటీవల పరిశోధకులు 50, 60, 70 ఏళ్ల వయసున్న ముగ్గురు వ్యక్తులను వర్గీకరించారు. ఇందులో 50 ఏళ్లు పైబడిన వారు 5 గంటలు లేదా అంతకంటే తక్కువ నిద్రపోతున్నారని డేటా వెల్లడించింది. సాధారణ నిద్రలో ఉన్న వారి కంటే వీరు 20 శాతం ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. నిద్రకి సంబంధించి 13 వ్యాధుల జాబితాను రూపొందించారు. మూడు వయసుల వారిలోనూ 5 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోవడం వల్ల మల్టిమోర్బిడిటీ ప్రమాదం 30 నుంచి 40 శాతం పెరిగినట్లు పరిశోధకులు వెల్లడించారు.
నిద్రలేమి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయని, చాలా కాలం పాటు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. మీరు తక్కువ నిద్రపోతే జ్ఞాపకశక్తి చాలా బలహీనంగా ఉంటుంది. ఏ పనిపై దృష్టి పెట్టలేరు. తక్కువ నిద్రపోయే అలవాటు ఉంటే రోగనిరోధక శక్తి చాలా వేగంగా బలహీనపడుతుంది. ఇతర వ్యాధులు మిమ్మల్ని చుట్టుముడుతాయి. సమస్య ఎక్కువైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.