ఆరోగ్యానికి నెయ్యి.. ఎన్ని ప్రయోజనాలో..

ఆరోగ్యానికి నెయ్యి.. ఎన్ని ప్రయోజనాలో.. ఆరోగ్యానికి నెయ్యి.. ఎన్ని ప్రయోజనాలో..

Update: 2019-09-29 06:01 GMT

నెయ్యిని చాలా మందిని ఇష్టంగా తింటారు. కొన్ని రకాల వంటకాలలో నెయ్యిని అధికంగా వాడుతుంటారు. నెయ్యి వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక టీస్పూన్ నెయ్యి తింటే చాలా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. నెయ్యి తిన్న తర్వాత ఓ గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. దీని వల్ల శరీరానికి మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం పరిగడుపున నెయ్యి తినడం వల్ల జీర్ణ సమస్యలు దరి చేరవు. జీర్ణ పక్రియను వేగవంతం చేసి సమర్ధవంతంగా జరిగేలా చేస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం సమస్యలతో బాధపడేవారికి నెయ్యితో ఉపశమనం దొరుకుతుంది. దృష్టి సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న వారు నెయ్యిని తీసుకోవాలి. దీంతో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. నేత్ర సమస్యలు పోతాయి.

అయితే చాలా మందికి ఉండే అపోహ ఏటంటే నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావన. నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచదు. వాటిలో గుడ్ కొల్ స్ట్రాల్ ఉండడం వల్ల గుండె సంబంధ వ్యాధులు కూడా రావు. గర్భిణీ మహిళలైతే నిత్యం నెయ్యిని కచ్చితంగా తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. రోజు తినడం వల్ల ఎన్నో కీలక పోషకాలు గర్భిణీ స్త్రీలకు లభిస్తాయి. అలాగే పిండం కూడా చక్కగా ఎదుగుతుంది. యాంటీ వైరల్‌, యాంటీ బాక్టీరియల్ గుణాలు నెయ్యిలో అధికంగా ఉన్నాయి.

Tags:    

Similar News