వాటిని శుభ్రం చేస్తున్నారా?

Update: 2019-07-19 10:14 GMT

మనం తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ద్వారా ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ లాంటి పోషక పదార్థాలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే వాటిని ఉపయోగించు ముందు తప్పనిసరిగా కొన్నిపద్దతులు పాటించాలి. మార్కెట్‌ నుంచి తెచ్చిన పళ్లను శుభ్రం చేయకుండా అలాగే తింటే అంతే సంగతులు. తినేముందు ఈ కూరగాయలు, పండ్లను ఇలా శుభ్రం చేయాలి. ఆపిల్‌, ద్రాక్ష, చెర్రీ లాంటి పండ్లతో పాటు టమాట, బంగాళాదుంప వంటి కూరగాయల్ని ఫాస్ట్‌గా వచ్చే వాటర్‌తో కనీసం 30 సెకండ్ల పాటు శుభ్ర పరచటం మంచిది.

అలాగే ఓ పెద్ద బౌల్‌లో కొంచెం ఉప్పు కలిపి కూర గాయల్ని, పండ్లను పది నిమిషాల పాటు ఉంచాలి. దీంతో దానిపై ఉండే హానికర రసాయనాలు తొలిగిపోతాయి. తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. వెడల్పాటి గిన్నెలో నీళ్లను తీసుకుని అందు లో కొంచెం వెనిగర్‌ వేసి వాటిలో కూర గాయలు, పండ్లు వేసి పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. దీంతో పండ్లపై ఉండే రసాయనాలు, మైనం తొలిగిపోతుంది. అలాగే కూరగాయలపై ఉండే చెడు బ్యాక్టీరియా వదిలిపోతుంది. మంచి నీటిని, నిమ్మరసం, వెనిగర్‌ కలిపిన ద్రవాన్ని స్ప్రే బాటిల్‌లో తీసుకుని పండ్లు, కూరగాయలపై స్ప్రే చూయాలి.తర్వాత నీళ్లతో శుభ్రం చేసి గుడ్డతో తుడవాలి. అనంతరం వాటిని ఉపయోగించుకోవచ్చు. 

Tags:    

Similar News