జుట్టు అందానికి గోరింటాకు..

Update: 2019-06-26 16:21 GMT

తర తరాలనుంచి గోరింటాకు మన జుట్టు అందానికి ఉపయోగపడుతుంది. ఐతే గోరింటాకు జుట్టుకే కాకుండా, సందర్బాన్నిబట్టి స్త్రీలు.. చేతులు, కాళ్ళకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పొడవైన, మృదువైన, మరియు అందమైన జుట్టుని పొందడానికి గోరింటాకు చాల ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.

సహజమైన గోరింటాకుతో.. టీ ఆకులు , పెరుగు , నిమ్మరసం మరియు ఉసిరికాయ రసం వంటి ఇతర పదార్ధాలను కలిపి ఉపయోగిస్తే మంచి సత్ఫలితాలు పొందవచ్చుంటున్నారు నిపుణులు.

* గోరింటాకుని మొదటిసారిగా ఉపయోగించే వారు రోజూకి 4-5 సార్లు తలకు పట్టించాలి. కొన్ని వారాల పాటు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

* గోరింటాకు చాలా చల్లదనాన్ని ఇస్తుంది. జలుబు, దగ్గు, జ్వరము, ఉన్నప్పుడు గోరింటాకు ఉపయోగించడం మంచిది కాదు.

* చుండ్రు సమస్యను గోరింటాకు ద్వారా పరిష్కరించవచ్చు అంటున్నారు నిపుణులు.

* గోరింటాకులో తలనొప్పి మరియు నిద్రలేమిని నయం చేసే గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News