మొటిమలను ఇలా కూడా తొలగించ వచ్చా..!

Update: 2019-07-18 10:22 GMT

టీనేజ్‌లో ఉండే చాల మంది మొటిమల సమస్యతో బాధపడుతుంటారు. మొటిమలు కొంత మందికి పెద్ద సమస్యలా ఉంటుంది. అయితే వాటిని సమస్యల కాకుండా శరీరంలో వచ్చే మార్పుల్లో అది కూడా ఒకటి అని భావించాలంటున్నారు నిపుణులు. మొటిమలను తగ్గించుకోటానికి కుర్రకారు చాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కువ మంది చేసిది మొటిమలను పగలగొడుతుంటారు. అలా చేస్తే ముఖంపై మచ్చలు ఏర్పడతాయి అంటున్నారు నిపుణులు. ఆ తరువాత వాటిని తొలగించటం కష్టమైన పనే.. కానీ కొన్ని చిట్కాలు వాడితే ఈ సమస్యలకు ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* చిన్న ఐస్ గడ్డను తీసుకుని.. ఓ క్లాత్ లో చుట్టి, మొటిమలు ఉన్న ప్రదేశంలో కొన్ని సెకన్ల పాటూ ఉంచాలి.. ఇలా కొన్ని సార్లు చేయటం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

* అలాగే రోజు ఉదయాన వాడే టూత్పేస్ట్ తో మొటిమలను తగ్గించ వచ్చు అంటున్నారు నిపుణులు. అయితే వైట్ టూత్పేస్ట్ ను మొటిమలపై అప్లై చేసి, అరగంట పాటూ అలాగే ఉంచితే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు.

* ఒక పాత్రను తీసుకొని, అందులో వేడి నీటిని పోయాలి. ఈ నీటి నుండి వచ్చే నీటి ఆవిరి మీ ముఖానికి తగిలే విధంగా కొద్ది సేపు ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకొని, ఆయిల్-ఫ్రీ తేమభరిత లోషన్ లను అప్లై చేస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు.

* అల్లం లో కూడా మొటిమలను తగ్గించే సమర్థవంతమైన సహజ ఔషద గుణాలు ఉన్నాయి. ఒక అల్లం ముక్కను తీసుకొని, 5 నుండి 7 పాటూ ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయాలి. తరువాత నీటితో కడిగి మళ్ళి అల్లం ముక్కను ఉంచాలి. ఇలా తరచుగా చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

* 3 గుడ్ల నుండి తెల్లసొనను తీసుకొని, 3 నిమిషాల పాటూ అలాగే ఉంచండి. ఒకసారి తెల్ల సొన సెట్ అయిన తరువాత, మొటిమలు ఉన్న ప్రాంతంలో చేతి వేళ్ళతో దీనిని అప్లై చేయాలి. అలా కొంచెం సేపు ఉంచి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగివేయాలి. ఇలా రోజులో 3 నుండి 4 సార్లు చేయటం వలన మొటిమల నుండి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  

Tags:    

Similar News